మనిషి.. తన వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటాడు. తన బంధువులకు వివిధ రకాల సాయాలు కూడా చేస్తుంటాడు. అయితే అలా సాయం పొందిన వారే వెన్నుపోటు పొడుస్తారు. కానీ మూగ జీవాలు అలా కాదు. తను పెంచిన యజమాని కోసం ప్రాణ త్యాగాలకైన సిద్దపడుతుంటాయి. అలాంటి ఘటనలు ఎన్నో మనం చూశాం. విశ్వాసంలో మనిషి.. మూగ జీవాలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువ! తాజాగా ఓ కొండముచ్చు చేసిన పని అందరిని కంటతడి పెట్టించింది. తనను ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి చనిపోవడంతో ఆయన శవం వద్ద ఉండిపోయింది. అంతే కాకా ఆ వ్యక్తి శవయాత్ర వాహనం వెంట పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీలంకలోని బట్టికలోవాలో తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్ నివాసం ఉంటున్నాడు. ఆయనకు మూగ జీవాలంటే ప్రాణం. ఆయన వద్ద కొన్ని రకాల జీవాలు ఉండేవి. వాటికి నిత్యం పోషణ అందిస్తూ హాయిగా జీవిస్తున్నాడు. ఈక్రమంలో అడవి నుంచి ఓ కొండ ముచ్చు వచ్చింది. దానిక ఎవరు ఆహారం అందించడంలేదు. దీంతో పీతాంబరం రాజన్ .. ఆ కొండ ముచ్చుకు రోజూ ఆహారం అందించేవాడు. అలా కొన్నాళ్లు జరిగింది. రాజన్ అనారోగ్య కారణాలతో ఆక్టోబర్ 17న చనిపోయారు. దీంతో ఆయన శవం వద్ద ఆ కొండముచ్చు చాలా సమయం పాటు ఉంది. రాజన్ పై తనకున్న విశ్వాసం, ప్రేమను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.
అలానే నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని పాతపేటల ఓ కొండముచ్చు కూడా అలానే చేసింది. తనకు తిండి పెట్టిన బలిజ లక్ష్మి దేవి అనే మహిళ చనిపోతే ఆమె శవయాత్రలో ఆ కొండముచ్చు పరుగులు తీసింది. లక్ష్మిదేవి అనే మహిళ టౌన్ లో బజ్జీల కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఓ కొండముచ్చు రోజూ ఆమె దుకాణం వద్దకు వచ్చేది. ఆమె రోజూ తిండి పెట్టేది. మంగళవారం నాడు లక్ష్మిదేవి కనిపించలేదు. ఆమె కోసం కొండముచ్చు అన్నిచోట్ల వెతికింది. ఆమె గుండెపోటుతో మరణించింది. దీంతో అంత్యక్రియకోసం ఓ వాహనంలో బంధువులు బయలు దేరారు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆ కొండముచ్చు ఆ వాహనం వెంట పరుగులు తీసింది. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
All lives, #animals #birds #plants have intelligence & emotions. #Monkey mourns death of man who fed every day. By kissing him. Touching.
Happened in #Srilanka. Mattaglabbu. pic.twitter.com/nBLKEW2JUZ
— Straight Talk India (@sttalkindia) October 20, 2022