తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో ఖ్యాతిని మూటగట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని గుర్తింపుని సంపాదించింది. దీంతో తెలంగాణలో ప్రతీ ఎటా బతుకమ్మ పండగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మన సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచమంతటా చాటి చెప్పేన ఈ పండగను ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వేడుకను ప్రదర్శించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి కవిత, ఇతర నాయకులు శ్రీకారం చుట్టారు. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్షమంది ఈ బతుకమ్మ వేడుకను బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై బతుకమ్మను వీక్షించనున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రదర్శించనున్న ఈ బతుకమ్మ వేడుకలకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక రేపు రాత్రి 9.40 నిమిషాలకు ఈ వేడుకలను ప్రారంభించనున్నారు.