చిన్న వయస్సులోనే పేరు తెచ్చుకున్న ప్రముఖులు ఇటీవల కన్నుమూస్తున్నారు. కొంత మంది అనారోగ్య సమస్యలతో, మరికొంత మంది ప్రమాదవశాత్తూ చనిపోతున్నారు. తాజాగా మరో మోడల్ ప్రమాదవశాత్తూ తుది శ్వాస విడిచారు.
చిన్న వయస్సులోనే పేరు తెచ్చుకున్న ప్రముఖులు ఇటీవల కన్నుమూస్తున్నారు. కొంత మంది అనారోగ్య సమస్యలతో, మరికొంత మంది ప్రమాదవశాత్తూ చనిపోతున్నారు. మొన్నటికి మొన్న ప్రముఖ మోడల్, బిటీఎస్ గాయకుడు జిమిన్‌లా కనిపించేందుకు 12 ఆపరేషన్లు చేయించుకున్న కెనడీయన్ నటుడు శాండ్ వాన్ మృతి చెందాడు. ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్‌లా మారేందుకు తనను తాను మార్చుకున్న మోడల్ క్రిస్టినా ఆష్టన్ గోర్కానీ గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. తాజాగా మరో మోడల్ ప్రమాదవశాత్తూ తుది శ్వాస విడిచారు.
మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్, ప్రముఖ మోడల్ సియెన్నా వీర్ (23) ఓ ప్రమాదంలో మరణించారు. 2022 మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్‌గా నిలిచిన సియోన్నా గుర్రపు స్వారీ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెదీ ఆస్ట్రేలియా. సియెన్నా 23 సంవత్సరాల చిన్న వయస్సులోనే కన్నుమూశారు. సియెన్నా ఏప్రిల్ 2వ తేదీన ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్‌లో స్వారీ చేస్తుండగా కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయడింది. దీంతో ఆమెను చాలా రోజులపాటు లైఫ్ సపోర్ట్‌లో ఉంచి చికిత్స అందించారు.
మూడేళ్ల వయస్సు నుండే ఆమె గుర్రపు స్వారీ చేస్తుండటం గమనార్హం. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సుమారు నెల రోజుల పాటు లైఫ్ సపోర్టుతో చికిత్స పొందిందీ సియోన్నా. ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో చివరకు లైఫ్ సపోర్ట్ తీసేశారు. దీంతో ఆమె చనిపోయింది. ఆమె మరణాన్ని మోడలింగ్ ఏజెన్సీ స్కూప్ మేనేజ్‌మెంట్ కూడా ధృవీకరించింది. సియెన్నా ఫొటోలను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.‘‘ఎప్పటికీ మన హృదయాల్లో’’ అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. 2022 ఆస్ట్రేలియన్ మిస్ యూనివర్స్ పోటీలో 27 మంది ఫైనలిస్టులలో సియన్నా వీర్ ఒకరు. ఆమె సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యం, మనస్తత్వశాస్త్రంలో డబుల్ డిగ్రీ చేశారు.
Miss Universe finalist, Sienna Weir, has sadly died at age 23 from an accident falling from a horse. pic.twitter.com/TB1TGspZmO
— Pop Tingz (@ThePopTingz) May 5, 2023