మెక్సికోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెక్సికో సినాలో ఒక సైనిక హెలికాప్టర్ కుప్పకూలడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో పద్నాలు మంది దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ హెలికాప్టర్ లో 15 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని నావికాదళం తెలిపింది. హెలికాప్టర్ లో అమెరికాకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, డ్రగ్స్ మాఫీయాధినేత రఫేల్ కారో క్వింటేరో ను మెక్సికో పోలీసులు అదుపులోకి తీసుకున్న కొద్ది గంటల్లోనే ఈ దుర్గటన జరిగింది.
ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని.. ఈ ప్రమాదానికి మాఫీయా డాన్ రఫల్ అరెస్టు కి ఏదైనా సంబంధం ఉండీ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాకపోతే ఈ విషయం పై ఎలాంటి స్పష్టత లేదని అధికారులు అంటున్నారు. ఒకప్పుడు అమెరికా మెక్సికో లో రఫేల్ డ్రగ్స్ మాఫియాలో పెద్ద గ్యాంగ్ మెయింటేన్ చేశారు. డ్రగ్స్ సంబంధిత వ్యాపారాలు మాత్రమే కాకుండా ఇతర నేరాలు కూడా ఆయన చేసేవారని అందుకే అప్పట్లో ఆయనను మోస్ట్ వాంటెడ్ లీస్ట్ లో చేర్చారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
ఇది చదవండి: ట్యాక్సీ డ్రైవర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.. కానీ ఈ పొరపాటే ఆమెను నిండాముంచింది!