పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అతి అరుదైన వేడుక. అయితే కొందరి జీవితంలో మాత్రం ఇది తరచూ జరుగుతూనే ఉంటుంది. పెళ్లి చేసుకోవడం భాగస్వామికి విడాకులు ఇవ్వడం.. ఆ తరువాత మరొకరిని చేసుకోవడం చేస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే పండు వయస్సు వారు కూడా పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా 92 ఏళ్ల బిలీనియర్ ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అతి అరుదైన వేడుక. అయితే కొందరి జీవితంలో మాత్రం ఇది తరచూ జరుగుతూనే ఉంటుంది. పెళ్లి చేసుకోవడం భాగస్వామికి విడాకులు ఇవ్వడం.. ఆ తరువాత మరొకరిని చేసుకోవడం చేస్తుంటారు. మరికొందరు ఐదు, ఆరు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే పండు వయస్సు వారు కూడా పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా 92 ఏళ్ల బిలీనియర్ ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకుని, విడాకులు ఇచ్చిన ఆ వ్యక్తి… తాజాగా మరో మహిళను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ క్రమంలో ఆయన చెప్పిన ఓ మాట అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ ఆస్ట్రేలినయన్-అమెరికన్ వ్యాపారవేత్త రూపర్ట్ మార్దొక్ మరోసారి పెళ్లికి సిద్ధమయ్యారు. ఈయన మీడియా మొఘల్ గా గుర్తింపు పొందారు. ఈయనకు వ్యాపారం రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ 92 ఏళ్ల వ్యాపారవేత్త పెళ్లికి సిద్ధమయ్యారు. శానిఫ్రాన్సిస్కో మాజీ పోలీస్ అధికారిణి ఆన్ లెస్లీ స్మిత్ (66)తో ఆయన ప్రేమలో పడ్డాడు. కొద్ది నెలల కిందటే తన ప్రేమ విషయాన్ని ఆన్ లెస్లీ స్మిత్ కు చెప్పగా .. ఆమె అంగీకరించింది. ఆయనతో జీవితం పంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే వీరి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆన్ లెస్లీ కి గతంలోనే పెళ్లైంది.
మీడియా ఎగ్జిక్యూటీవ్ గాయకుడైన ఛెస్టర్ స్మిత్ తో ఆమెకు వివాహం జరిగింది. ఆయన 14 ఏళ్ల కిందట చనిపోయారు. ఈ క్రమంలో ఇటీవలే ఆన్ లెస్లీ స్మిత్ కు రూపర్ట్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెళ్లికి దారి తీసింది. ఇక రూపర్ట్ మార్దోక్ విషయానికి వస్తే.. ఆయనకి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయి.. ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆ నలుగురికి విడాకులిచ్చి ఆయన తన ప్రియురాలు ఆన్ లెస్లీస్మిత్ తో ఐదో వివాహం చేసుకున్నారు. ఇరువురికీ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు రూపర్ట్ మర్దోక్ ప్రకటించారు. ఆయన 92 ఏళ్ల వయసులోనూ పెళ్లిపీటలు ఎక్కడం గమనార్హం. అయితే, ఇదే చివరి వివాహమని రూపర్ట్ పేర్కొన్నారు.
ఏడు నెలల కిందటే నాలుగో భార్య జెర్రీ హాల్ నుంచి మార్దోక్ విడాకులు తీసుకుని.. ఐదోసారి పెళ్లి కొడుకు మారారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మార్చి 17న న్యూయార్క్‌లో రూపక్ మర్దోక్, ఆన్ లెస్లీల నిశ్చితార్ధం జరిగింది. ఆ సందర్భంగా ప్రియురాలి చేతికి ఉంగరం తొడిగిన మర్దోక్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. “నేను ప్రేమలో పడటానికి భయపడ్డాను. కానీ, నాకు తెలుసు ఇదే నా చివరి వివాహం అని. ఇది బాగుంటుందని ఆశిస్తున్నా. ఆన్ లెస్లీ తో వివాహం నాకు చాలా సంతోషంగా ఉంది” అని మర్దోక్ చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. మరి.. 92 ఏళ్ల వయస్సులో పెళ్లి పీటలు ఎక్కనున్న ఈ వ్యాపారవేత్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.