ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లింది.
ఈ మధ్య వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, సిలిండర్ బ్లాస్ట్ లు అని ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వింటున్నాం. సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదంలో నిండా పాతికేళ్ళు కూడా నిండని యువకులు చనిపోయారు. తాజాగా బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఆదివారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మదారిపూర్ లోని కుతుబ్ పూర్ ప్రాంతంలో వంతెనపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.
కాలువ గట్టు గోడను బలంగా ఢీ కొట్టడంతో ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 19 మంది మృతి చెందగా.. దాదాపు 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే కాలువలో నీళ్లు లేకపోవడం వల్ల పూర్తి శాతం ప్రమాదం తగ్గిందని.. నీరు ఉంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండేదని స్థానికులు అంటున్నారు. ఇక ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాగా మృతులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
At least 19 killed, 30 injured in Bangladesh bus accident pic.twitter.com/EtFx8Ilvm6
— 𝗕𝗨𝗭𝗭 𝗖𝗜𝗧𝗬 (@BUZZCITY_) March 19, 2023