ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా ఖరీదైన వాచ్ దుబాయ్‌లో చోరీకి గురైంది. కాగా ఆశ్చర్యకరంగా ఆ వాచ్ మన దేశంలోని అస్సాం రాష్ట్రంలోని శివసాగర్ జిల్లాలో దొరికింది. ఈ దొంగతనం విషయంలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఖరీదైన హుబ్లాట్ వాచ్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ వాచ్మా మారడోనాదే అని తేల్చారు.
మారడోనాకు సంబంధిచిన విలువైన వస్తువులను భద్రపరిచే కంపెనీలో అరెస్ట్ అయిన వ్యక్తి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసేవాడు. అతను కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి అస్సాం తిరిగివచ్చాడు. అతను వచ్చిన తర్వాత వాచ్ చోరీ అయిన విషయం గ్రహించిన కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు భారత్ వచ్చి.. అస్సాం పోలీసులతో కలిసి శనివారం ఉదయం ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Football legend Diego Maradona’s watch, allegedly stolen in Dubai, recovered from Assam’s Sivasagar district; one person arrested: Police
— Press Trust of India (@PTI_News) December 11, 2021