ఆరుగురు భార్యలతో సంతోషంగా జీవిస్తున్న అతడి జీవితంలోకి ఓ అనుకోని సమస్య వచ్చిపడింది. ఆ సమస్యను పరిష్కరించటానికి ఎంతో కష్టపడ్డ అతడు చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు.
ఆథర్ ఓ సుర్సో ఇతడి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 9 మందిని పెళ్లి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మీడియాలో బాగా ప్రచూర్యం పొందాడు. అసలు ఒక్క సారి కూడా పెళ్లి కాని వారు ఇతడ్ని చూసి కుళ్లుకుంటున్నారు. అయితే, నత్త కష్టాలు నత్తవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు అతడికి ఓ పెద్ద సమస్య వచ్చింది. తనతో ఉన్న భార్యల్లో ఎవరిని మొదట తల్లిని చేయాలనే విషయంలో బుర్ర బద్దలు కొట్టుకుని, చివరకు ఓ నిర్ణయం తీసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్లోని సావో పాలోకు చెందిన ఆథర్ ఓ సుర్సోకు మొత్తం 9 మంది భార్యలు వీరిలో ముగ్గురికి తాజాగా విడాకులు ఇచ్చాడు.
ప్రస్తుతం ముగ్గురు భార్యలతో జీవిస్తున్నాడు. లూనా కజిక, ఎమెల్లి సౌజా, వాల్వ్కిరా సాంతోస్, ఒలిండా మారియా, డామియానా, అమాండ వారి పేర్లు. ఆ ఆరుగురు గర్భం దాల్చే విషయంలో ఆథర్‌కు ఓ పెద్ద సమస్య వచ్చింది. వారిలో ఎవరిని మొదట తల్లిని చేయాలన్న ప్రశ్న అతడికి ఎదురైంది. వారిలో ఎవరో ఒకరిని మొదట తల్లిని చేస్తే మిగిలిన వారు బాధపడతారని అతడు అనుకున్నాడు. ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఉండేందుకు మార్గం కోసం వెతికాడు. ఈ నేపథ్యంలోనే సరోగసీ వైపు మొగ్గుచూపాడు. దీనిపై ఆథర్ మాట్లాడుతూ.. ‘‘ నేను నా భార్యల్లో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు.
అందుకే సరోగసీ వైపు మొగ్గుచూపాను. మొదట్లో ఇదో సున్నితమైన విషయంగా అనిపించింది. తర్వాత సరోగసీ వైపు మొగ్గుచూపాను. సరోగసీకి ఒప్పుకునే వారి కోసం ఇప్పుడు మేము ఎదురు చూస్తున్నాము. వాళ్లు మాకు భరోసా ఇవ్వాలి. నేను 40 వేల డాలర్లు ఖర్చు చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో ఎవరినైనా దత్తత తీసుకోవాలని చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.