నుదుటిపై తిలకం, ఒంటిపై అమెరికా ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్.. ఈ రెండింటికీ సంబంధం ఏంటి..? అసలు ఈ రెండింటి కాంబినేషన్ సెట్టవుతుందా..?ఈ డౌట్స్ అన్నీ మీకు వచ్చే ఉంటాయి. కానీ..ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఓ భారత సంతతి వ్యక్తి.. ఇంతకీ అతనెవరు..? ఎలా దీన్ని సాధించాడు..?మరి ఆ సంగతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికా వాయుసేనలో ఎయిమ్యాన్ గా చేస్తున్న భారత సంతతి వ్యక్తి దర్శన్ షా. ప్రస్తుతం వ్యోమింగ్‌లోని FE వారెన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో పనిచేస్తున్నారు దర్శన్. యూనిఫాంలో ఉన్నా తిలకం పెట్టేందుకు అనుమతించాలని మిలటరీ ట్రైనింగ్ స్కూల్లో ఉండగానే తాను కోరానని చెప్పారు దర్శన్. అయితే.. టెక్ స్కూల్‌కు వెళ్లాక ప్రయత్నించమని వాళ్లు చెప్పారని తెలిపారు. టెక్ స్కూల్లో ఇదే విషయం అడిగితే.. డ్యూటీలో చేరాక అక్కడి అధికారుల్ని సంప్రదించమని అన్నారని చెప్పారు. ఇన్నాళ్లకు తనకు అనుమతి లభించిందని.. తిలకం తానేంటో చెబుతుందన్నారు. తిలకం పెట్టుకోవడం ఎంతో ప్రత్యేకమని.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అదొక మార్గమన్నారాయన.
ఎయిర్‌ఫోర్స్ బేస్‌లోని ‘మైటీ నైన్టీ’ దళంలోని సహచరులూ తనను అభినందిస్తున్నారని చెప్పారు దర్శన్. 2022 ఫిబ్రవరి 22న తొలిసారి ఆయన తిలకం పెట్టుకుని విధులకు హాజరయ్యారు. ఆన్లైన్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న అనేకమంది ఆయన్ని అభినందనల్లో ముంచెత్తుతున్నారు.ఈ మతపరమైన మినహాయింపు పొందేందుకు తాను ఎంతగానో శ్రమించానని అన్నారు. ఇందుకోసం తాను పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారాయన. అమెరికా వాయుసేన, తిలకం.. ఈ రెండూ దర్శన్ ప్రధాన గుర్తింపులు. ఇప్పుడు ఈ రెండూ కలిపి ధరించడం తనకెంతో గర్వకారణమని చెబుతున్నారు దర్శన్. యూనిఫాంలో ఉన్నా, లేకపోయినా మతపరమైన భావప్రకటనా స్వేచ్ఛ ఉన్న దేశంలో జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు దర్శన్ షా. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.