Viral Video: బ్యాంకు ఖాతాలో డబ్బులు దాచుకున్న కస్టమర్లు పడే కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న అవసరాలకు కూడా బ్యాంకు చుట్టూ పదుల సార్లు తిరిగితే కానీ, పనులు కావు. మన అకౌంట్‌లో డబ్బులు మనం తీసుకోవటానికి కూడా ఆంక్షలు. అత్యావసరాలకు కూడా బ్యాంకు చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. తాజాగా, అత్యావసరానికి డబ్బు ఇవ్వకపోవటంతో బ్యాంకునే హైజాక్ చేశాడు ఓ కస్టమర్. అందరినీ బంధించి తన డబ్బు తాను తీసుకున్నాడు. ఈ సంఘటన లెబనాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
లెబనాన్‌లోని బీరట్‌లోని ఓ బ్యాంకులో బాసమ్ అల్ షేక్ హుస్సెన్ అనే వ్యక్తికి అకౌంట్ ఉంది. కొద్దిరోజుల క్రితం తండ్రి ఆసుపత్రి బిల్లులు చెల్లించటానికి డబ్బులు అవసరం అయి బ్యాంకుకు వెళ్లాడు. అకౌంట్‌లో ఉన్న మొత్తంలోనుంచి కోటి అరవై లక్షల రూపాయలు విత్ డ్రా చేయాలని చెప్పాడు. అయితే, బ్యాంకు వాళ్లు ఇందుకు ఒప్పుకోలేదు. తర్వాత రమ్మని చెప్పి పంపేశారు. దీంతో బాసమ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇంటికెళ్లిపోయి ఈ సారి గన్‌తో బ్యాంకుకు వచ్చాడు. గన్‌తో భయపెట్టి బ్యాంకును తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు.
అతడు చేసిన పనికి భయపడిపోయిన బ్యాంకు వాళ్లు అతడి డబ్బులు విత్ డ్రా చేసి ఇచ్చారు. బ్యాంకు హైజాక్ సందర్భంగా బాసమ్ జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి గాయాలయ్యాయి. ఈ సంఘనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతడ్ని హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Lebanon: A man has taken as many as 10 people hostage in a Beirut bank today after he was denied the ability to withdraw savings to pay his father’s medical bills. The man, named Bassam al-Sheikh Hussein, reportedly was denied access to $210,000. https://t.co/7f0EkEPm72 pic.twitter.com/omqfZDucki
— POPULAR FRONT (@PopularFront_) August 11, 2022
ఇవి కూడా చదవండి : ఇంటర్వ్యూలో మహిళ వయసు అడిగి.. 3 లక్షలు పరిహారం చెల్లించిన డోమినోస్..