సాధారణంగా చిన్న పిల్లలు ఎది కనిపిస్తే దాన్ని నోట్లో వేసుకోవడం చూస్తేనే ఉంటాం. కొన్ని సార్లు అపాయకరమైన వస్తువులు మింగేసి నానా అవస్థలు పడుతుంటారు.. అందుకే తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయంలో చాలా శ్రద్ద వహించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే చిన్న పిల్లలు అలాంటివి తెలియక చేస్తారు. కానీ ఓ ప్రబుద్దుడు 33 ఏళ్ల వయసులో ఓ సెల్ ఫోన్ మింగేసి తర్వాత నానా అవస్థలు పడ్డాడు. అయితే సెల్ ఫోన్ ఎందుకు మింగాడో మాత్రం తెలియరాలేవు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ కాలంగా మారింది. సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు తమ స్థాయిలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఒకప్పుడు నోకియా 3310 మోడల్ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రిస్టిన కోసోవో అనే 33 ఏళ్ల వ్యక్తి నోకియా 3310 మోడల్ ఫోన్ మింగేశాడు. కారణం అయితే తెలియదు కానీ.. మింగిన తరవాత కడుపు నొప్పి రావడంతో లబో దిబో అంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. ప్రిస్టిన కోసోవో పడుతున్న అవస్థ చూసి డాక్టర్లు వెంటనే స్కానింగ్ తీశారు. అంతే కడుపులో ఉన్న వస్తువు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ప్రిస్టిన కోసోవో ఫోన్ మింగగా అది పేగుల్లో ఇరుక్కుంది. వెంటనే ఆపరేషన్ చేసి ఫోన్ భయటకు తీయకపోతే అతడి ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించిన వైద్యులు మేజర్ ఆపరేషన్ చేసి ఫోన్ ను బయటకు తీశారు. ఒకవేళ లేట్ అయి ఉంటే.. బ్యాటరీ బయటకు వస్తే అందులో ఉండే కెమికల్స్ వల్ల వ్యక్తి ప్రాణాలు పోయి ఉండేవని డాక్టర్లు చెబుతున్నారు. మొత్తానికి మనోడు చేసిన తప్పు తెలుసుకొని వెంటనే ఆసుపత్రికి పరుగెత్తడం మంచిదైందని.. లేదంటే ప్రాణాలు పోయి ఉండేవని డాక్టర్లు చెబుతున్నారు. అయితే అతడు ఫోన్ ఎందుకు మింగాడో డాక్టర్లు ఎంతలా ప్రశ్నించినా చెప్పలేదని అంటున్నారు.