ఈరోజుల్లో ఒక భార్యతోనే ఏగలేక నానాపాట్లు పడుతున్న భర్తలు ఎందరో ఉన్నారు. లాక్ డౌన్ రోజుల్లో.. భార్యలు కొడుతున్నారంటూ, తిడుతున్నారంటూ బయటకొచ్చిన భర్తలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అలాంటిది ఓ భర్త ఆరుగురు భార్యలతో కలిసి హాయిగా జీవితం గడుపుతున్నాడు. ఎంతలా అంటే 20 అడుగుల బెడ్‌పై అందరూ ఒకేచోట నిద్రిస్తున్నారు.
ఒక భార్య ఉంటేనే ఎన్నో అలకలు.. మరెన్నో గొడవలు. కానీ అతగాడికి ఆరుగురు భార్యలున్నా ఎలాంటి గొడవలు లేవు. ఉదయం లేచింది మొదలు ఆరుగురు భార్యలు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. పనుల్లో ఒకరికొకరు సాయం చేసుకునేవారు. ఇలా కలిసిమెలిసి ఉంటున్న వారి జీవితంలో చీకటి చిచ్చుపెట్టేది. ఎందుకో తెలుసా..? చీకటి పడితే భర్తను మిస్ అవుతాం అని. ఏ ఒక్కరితో అతడు నిద్రపోయినా.. మిగిలిన వారు కోప్పడేవారు. ఉదయం లేవగానే.. ఆ రోజు రాత్రి పడుకున్న ఒక్క భార్యను మినహాయిస్తే.. మిగిలిన ఆరుగురు మొహాలుతిప్పుకునేవారు. ఈ సమస్య అతని జీవితంలో ప్రతి రోజూ ఎదురయ్యేది. దీని పరిష్కారం కోసం ఇంటర్నెట్ లో శోధించగా ఓ కత్తిలాంటి ఐడియా అతని బుర్రను తట్టింది. అదే.. అందరూ ఒకే బెడ్‌పై నిద్రించాలన్న ఆలోచన.
బ్రెజిల్‌కు చెందిన ఆర్థర్ ఓ ఉర్సోకు ఆరుగురు భార్యలు. ఒకరికొకరు పరిచయం లేకున్నా ఆరుగురు భార్యలు ఎంతో ఆదర్శంగా, అక్క చెల్లెల్లులా కలిసిమెలిసి ఉండేవారట. కానీ భర్తతో బెడ్ పంచుకునే విషయం దగ్గర కాస్త ఆలోచనలో పడేవారట. చీకటి పడుతోందంటే అలకలు మొదలయ్యేవట. కొన్ని సందర్భాల్లో వారిని ఇబ్బంది పెట్టలేక అతడే పలుమార్లు ఒంటరిగా సోఫాలో లేదా నేలపై పడుకోవల్సి వచ్చేదట. అందుకే, అందరికీ కలిపి ఒక బెడ్ ఉండాలన్న ఆలోచన చేశాడట. అంతా తలోదిక్కు నిద్రపోడానికి బదులు.. ఒకే చోట నిద్రపోతే ఎంతో హాయిగా ఉంటుందని భావించి.. ఒక పెద్ద మంచాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడట. ఆ ఆలోచన ఫలితమే ఈ 20 అడుగుల బెడ్.
ఈ మంచం తయారీ కోసం ఆర్థర్ 80 వేల పౌండ్లు వెచ్చించాడని తెలిపాడు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.80 లక్షలు పైమాటే. 20 అడుగుల వెడల్పు, 7 అడుగుల పొడవు ఉండే ఈ మంచాన్ని 12 మంది సిబ్బంది 15 నెలల పాటు శ్రమించి తయారుచేశారట. మొత్తం 950 స్క్రూలతో ఈ మంచాన్ని బిగించారట. ప్రస్తుతానికి అతడు ఎలాంటి చీకూ చింత లేకుండా అందరితో కలిసి దానిపై హాయిగా నిద్రిస్తున్నాడట. ఈ ఘనకార్యాలను ఆర్థర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. భార్యలతో ఉన్న ఫోటోను, తన 20 అడుగుల మంచం ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మంచమని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇతగాడి దాంపత్య జీవితం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. ‘అన్నీ చెప్పావు గానీ, దాని సంగతేంటి..?’ అంటూ నెటిజన్స్ అతనిని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. ఏదేమైనా ఎక్కువ భార్యలన్నా భర్తలకు ఇతగాడు ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవాలి. ఈ ఆదర్శపు భర్తపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.