ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ‘ఫేస్ బుక్’ గురించి ఇప్పుడు ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. చిన్నా పెద్దా అందరికీ తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే.. బ్యాంకు ఖాతాలు ఉన్నా లేకున్నా ఫేస్ బుక్ ఖాతాలు మాత్రం ఎంతో మంది మెయింటేన్ చేస్తున్నారు. అయితే ఫేస్ బుక్ వల్ల కొంత మంది నష్టపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నా.. కొంతమందికి మాత్రం మంచి చేకూరుతుంది.
ఎప్పుడో తప్పిపోయిన తమ సొంతవాళ్లు ఫేస్ బుక్ పుణ్యమా అని కలిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలోనే కన్న తల్లికి దూరమైన ఓ పిల్లాడు.. 20 సంవత్సరాల తరువాత ఫేస్ బుక్ ద్వారా తన తల్లికి దగ్గరైతే ఎలా ఉంటుంది. ఆ ఆనందానికి అవధులు ఉండవు.. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: Shantabai: ఈ భార్య వక్రబుద్ది వాళ్ళ కాపురాన్ని కూల్చేసింది! అంతా భర్తకి తెలిసే..!
యూఎస్ ఏ లోని ఉటాకు చెందిన బెంజిమన్ హుల్ బేర్డ్ తనకు జన్మనిచ్చిన తల్లి హులీ షియరర్, కొన్ని కారణాల వల్ల ఏంజెలా, బ్రియాన్ హుల్ బెర్గ్ లకు దత్తత ఇచ్చినట్లు తెలిపాడు. ఈ విషయం తన చిన్ననాటి నుంచి తెలుసునని.. సొంత తల్లి పేరు హూలీ షియరర్ అని మాత్రమే తనకు గుర్తు ఉందంటూ యంగ్ మెన్.. గుడ్ మార్నింగ్ న్యూస్ తో షేర్ చేసుకున్నాడు. నా సొంత తల్లిని వెతికేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నానని.. అనేక సార్లు లేఖలు కూడా రాశానని తెలిపారు.
ఇక తనను దత్తత ఇచ్చిన ఏజెన్సీ మూసి వేయడంతో తన తల్లిని కనుగొనాలనే ఆశతో ‘డిఎన్ఏ’ టెస్టులు కూడా చేయించుకున్నానని తెలిపాడు. కానీ ఫలితం మాత్రం లభించలేదని వాపోయాడు. ఆరు నెలల క్రితం బెంజిమెన్ పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి షియరర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఫేస్ బుక్ లో ఓ సందేశం పంపింది.
ఆ మెసేజ్ చూసి తనయుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని.. వెంటనే ఆ మెసేజ్ కి రిప్లే ఇచ్చానని బెంజిమన్ హుల్ బేర్డ్ తెలిపాడు. మొత్తానికి 20 ఏళ్లుగా ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. చివరిగా తన తల్లిని కలుసుకున్నానని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఒకరినొకరు కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నారు.
ట్విస్ట్ ఏంటంటే.. తల్లీ కొడుకులు గత రెండేళ్లుగా ఒకే ఆసుపత్రిలో పని చేస్తున్నారు. కానీ వీరిద్దరికీ తల్లీకొడుకులం అనే విషయం తెలియదు. ఏది ఏమైనా ఫేస్ బుక్ పుణ్యమా అని 20 ఏళ్ల తర్వాత తల్లీకొడుకులు కలుసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం అని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.