గనుల తవ్వకాల సమయంలో అనేక ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ విపత్తులో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. రెప్పపాటులో జరిగే ఈ ప్రమాదం ఎటు నుండి పొంచి వస్తుందో చెప్పలేం. ఆ సమయంలో మన ప్రాణాలను దక్కించుకునేందుకు ఆరాట పడతాం. కానీ అతడు తన ప్రాణాలను లెక్కచేయకుండా 9 మందిని రక్షించి రియల్ హీరో అయ్యాడు.
గనులను తవ్వే సమయంలో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఊహించని ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. రెప్పపాటులో ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఆ గందరగోళ పరిస్థితుల్లో మన ప్రాణాలను రక్షించుకునేందుకు ఆరాటపడతాం. కానీ వ్యక్తి తన ప్రాణాలను లెక్కచేయకుండా 9 మంది ప్రాణాలు కాపాడి రియల్ హీరో అయ్యాడు. ప్రమాదాన్ని ఊహించని కూలీలు బంగారపు గనిలో పనిచేస్తుండగా.. ఒక్కపారి పెను విపత్తు ముంచుకొచ్చింది. మట్టి చరియలు విరిగిపోయి.. గని ముఖ ద్వారం మూసుకుపోతుంటే.. అందులో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎవ్వరూ సాహసం చేయలేదు. అందులో ఇరుక్కుపోయిన మైనర్లను కాపాడి అతడు నిజమైన హీరోయిజాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గత శనివారం చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే కాంగోలో బంగారపు గనుల్లో కూలీలు పని చేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలడం ప్రారంభమైంది. బయటకి వచ్చే మార్గం మూసుకుపోతుండటంతో.. కూలీలు అందరూ బయటకు వచ్చేస్తున్నారు. అయితే మైనర్లైన 9 మంది బాలురు లోపలే చిక్కుకుపోయారు. మట్టి చరియలు విరిగిపడుతుండటంతో గని ప్రవేశ ద్వారం వద్దకు వచ్చేందుకు ఎవరూ సాహసించలేదు. వారిలో ఒక కూలీ మాత్రం మిగిలిన వారిలా చూస్తూ ఉండిపోలేదు. తక్షణమే గని ద్వారం వద్దకు వచ్చి చేతులతో మట్టిని తొలగించాడు. ఓ వైపు మీద నుంచి మట్టి పెళ్లలు ప్రమాదకరంగా విరిగిపడుతుంటే.. వెనకడుగు వేయకుండా ప్రవేశద్వారాన్ని దఫదఫాలుగా క్లియర్ చేశాడు. అతడికి మరో వ్యక్తి సహకరించాడు. దీంతో గనిలో చిక్కుకున్న బాలురు ఒకరి తర్వాత ఒకరు సజీవంగా బయటకి వచ్చారు. అలా 9 మంది బాలురు సురక్షితంగా బయటపడ్డారు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది.
బాలురు ఒక్కొక్కరూ క్షేమంగా బయటకి వస్తుండగా.. గని వెలువల నిల్చొని చూస్తున్న కూలీలందరూ కన్నీళ్లు, ఆనందం కలగలిపిన భావోద్వేగంతో గట్టిగా అరిచారు. గోల్డ్ మైన్ వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగానే.. అధికారులు రెస్క్యూ టీమ్‌తో అక్కడికి చేరుకున్నారు. అయితే, వారంతా అక్కడికి వచ్చే సరికే, గనిలో చిక్కుకున్న వారందరినీ ఒకే వ్యక్తి వట్టి చేతులతో రక్షించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. తన తోటి వారిని రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆ వ్యక్తిని ‘సూపర్ హీరో’ నెటిజన్లు కొనియాడుతున్నారు. కాంగో గనుల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. పని చేయకపోతే పూట గడవని పరిస్థితి నేపథ్యంలో మైనర్ల పిల్లలను తీసుకుని కూలీలకు వెళుతుంటారు తల్లిదండ్రులు. చివరకు ప్రమాదాల్లో మృత్యు ఒడికి చేరుకుంటారు.
Yesterday in DR Congo at around 2pm: artisanal copper miners saving each in Luwowo, in the Muvumboko neighbourhood pic.twitter.com/oCY2qplWKH
— Nicolas Niarchos (@PerneInAGyre) March 25, 2023