శృంగారం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు తప్పవు. ముఖ్యంగా మగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే.. తర్వాత శృంగారానికి పనికి రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది..
ప్రతీ మనిషి జీవితంలో శృంగారం అన్నది ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పెళ్లయిన భార్యాభర్తల మధ్య శృంగారం ఎన్నో రకాల ఉపయోగాలను కలుగ చేస్తుంది. మానసికంగా.. శారీరకంగా ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఓ చక్కటి శృంగారం ద్వారా ఏర్పడుతుంది. అయితే, కొన్నిసార్లు శృంగారంలో చేసే ప్రయోగాలు గాయాల పాలు చేసే అవకాశం ఉంది. తాజాగా, ఓ వ్యక్తి ప్రమాదకరమైన శృంగార భంగిమలో ఉండగా అంగం విరిగిపోయింది. ఈ సంఘటన ఇండోనేషియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన 37 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఓ మహిళతో శృంగారంలో ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆమెతో రివర్స్ కౌగాళ్ భంగిమలో ఇంటర్ కోర్స్ చేస్తూ ఉన్నాడు. ఆమె అతడి మీద వెనక్కు తిరిగి ఉంది. ఇద్దరూ శృంగారంలో ఉండగా అతడి అంగం ఫట్టున విరిగింది. పెద్ద శబ్ధం కూడా వచ్చింది. అంగం విరగటంతో అతడు విలవిల్లాడిపోయాడు. అంగం నుంచి రక్తం కూడా కారటం ప్రారంభమైంది. మూత్రం పోయటానికి కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అతడు నూసా టెంగారా ప్రావిన్స్‌లోని ఓ జనరల్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రికి వెళ్లే సమయానికి అతడి అంగం వాచి ఉంది. వంకపూత రంగులోకి మారింది. ఈ పరిస్థితి మెడికల్ టర్మినాలజీ ప్రకారం ‘‘ఎగ్‌ప్లాంట్ డీఫార్మిటీ’’ అంటారు.
వైద్యులు అతడి అంగానికి పరీక్షలు చేయగా.. లోపల పెద్దగా విరిగినట్లు తేలింది. అంగం ఎముకలతో నిర్మించకపోయినప్పటికి.. అందులోని టూనికా అల్బూజినియా పాడవుతూ ఉంటుంది. లోపలి కణజాలం దెబ్బతింటుంది. సదరు బాధితుడు శృంగారంలో పాల్గొన్న ఆ భంగిమ కారణంగా 50 శాతం మంది మగాళ్ల అంగాలు దెబ్బతింటున్నాయని వైద్యులు తెలిపారు. ఏదైతేనే వైద్యులు అతడి అంగానికి కుట్లు వేసి వైద్యం అందించారు. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడు.