ఏ విషయం అయినా పరిధి దాటితే పరిస్థితులు చేయి దాటిపోతాయి. పుర్రెకొక బుద్ధి.. జిహ్వకొక రుచి అన్నట్లు కొందరు అన్ని విషయాల్లో కొత్తదనం కోరుకుంటారు. అలా ఒక వ్యక్తి ఏకంగా శృంగారంలో కోరుకున్నాడు. చివరికి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
పుర్రెకొక బుద్ధి.. జిహ్వకొక రుచి అంటారు. అంటే ఒక్కొక్కరి బుద్ధిని బట్టి వారి వారి ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్కరి అభిరుచిని బట్టి వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి అంటారు. ఏ విషయంలోనైనా కొత్తదనం కోరుకోవచ్చు. ఏ పనినైనా కొత్తగా చేయాలి అనుకోవచ్చు. కానీ, ఆ పని ఎంత వరకు చేయాలి? దాని లిమిట్స్ ఏంటి? అనే విషయాలు కచ్చితంగా తెలిసి ఉండాలి. ఏదైనా శ్రుతి మించితే కొంప మునగడం ఖాయం. అలాగే శృంగారం విషయంలో ఒక వ్యక్తి చూపిన అత్యుత్సాహం అతని ప్రాణం మీదకు తీసుకొచ్చింది. వారం రోజులుగా ఐసీయూలో ఉంటూ తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.
అన్ని పనుల మాదిరిగానే శృంగారానికి కూడా పరిధి, పరిమితి అనేవి ఉంటాయి. అవి దాటి ఇష్టారీతిన ప్రవర్తిస్తే.. పర్యావసానం ఇలాగే దారుణంగా ఉంటుంది. ఇటలీలోని గ్రోసెటోలోని ఓ ఆస్పత్రిలో వెలుగు చూసిన వింత కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒక 50 ఏళ్ల జర్మన్ వ్యక్తికి శృంగారంలో పీక్స్ చూడాలి అనుకున్నాడు. అలా అనుకున్నదే తడవుగా వయాగ్రా బిళ్లలు పరిమితికి మించి వాడేశాడు. వాటి ప్రభావంతో తన భాగస్వామితో 24 గంటల పాటు సె*క్స్ మారథాన్ లో పాల్గొన్నాడు. అప్పటివరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కథ మొత్తం అడ్డం తిరిగింది. 24 గంటల మారథాన్ తర్వాత అతని అంగంలో నొప్పి రావడం ప్రారంభమైంది.
సమయం గడిచే కొద్దీ ఆ నొప్పి మరింత పెరిగింది. ఏం చేయాలో అర్థంకాక ఆ వ్యక్తి ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. అతని పరిస్థితి చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అతనికి శస్త్ర చికిత్స్ చేయక తప్పలేదు. ఆ సర్జరీలో అతని అంగాన్ని తొలగించారు. కానీ, అతని ఆరోగ్యం మెరుగు పడలేదు. అతను వారం రోజులుగా ఐసీయూలోనే ఉండి చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. అసలు అతను బతుకుతాడో లేదో కూడా నమ్మకంగా చెప్పడం లేదు. శృంగారంలో పీక్స్ చూద్దామని ప్రయత్నించి.. మళ్లీ జీవితంలో సె*క్స్ కి పనికిరాకుండా పోయాడు. ఏ విషయం అయినా లిమిట్స్ లో ఉంటేనే బాగుంటుంది.. కాదని పరిధి దాటితే ఇలాంటి అనర్థాలే జరుగుతాయంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Man faces having his penis amputated after ‘crazy’ 24-hour ecstasy and Viagra sex marathon https://t.co/2MMmEGb9tK pic.twitter.com/zYwukkYxps
— Daily Mail Online (@MailOnline) May 22, 2023