ఉన్నతమైన ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వ ఉద్యోగమయినా, ప్రైవేటు ఉద్యోగమయినా ఏదో ఒకటి సాధించాలని యువత శ్రమిస్తూ ఉంటుంది. అదే తరుణంలో ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం పొందితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇదే తరహాలో ఐబిఎంలో ఉద్యోగం పొందిన ఓ వ్యక్తి అనారోగ్య కారణాలతో 15 ఏళ్లుగా సిక్ లీవ్ లో ఉన్నాడు. సిక్ లీవ్ సమయంలో వేతనం పెంచలేదంటూ కంపెనీపై దావా వేసిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూకెకు చెందిన ఇయాన్ క్లిఫోర్డ్ 2000 సంత్సరంలో ఐబిఎం కంపెనీలో భారీ వేతనంతో (73వేల పౌండ్లు(రూ. 73లక్షలు) ఐటి స్పెషలిస్ట్ గా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత తను అనారోగ్యానికి గురయ్యాడు. ఆ కారణంచేత 2008 నుంచి సిక్ లీవ్ పెట్టుకున్నాడు. అయితే తనకు ఐదు సంవత్సరాల నుంచి వేతనం పెంచలేదని, సెలవు రోజులకు పేమెంట్ కూడా ఇవ్వలేదంటూ 2013లో ఐబిఎం కంపెనీని సంప్రదించాడు. దీంతో కంపెనీ ఆ ఉద్యోగితో కాంప్రమైజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మెడికల్లీ రిటైర్డ్ ప్లాన్ కింద అతని జీతంలో 75శాత ఇచ్చేందుకు కంపెనీ ఒప్పుకుంది. ఆ ఉద్యోగి ఆరోగ్యం కుదుట పడి మళ్లీ పని చేసేంతవరకు లేదా పదవీ విరమణ వయసు వచ్చేంత వరకు లేదా చనిపోయేంత వరకు వీటిలో ఏది ముందైతే అంతవరకు ఏటా ఫిక్స్ డ్ జీతం ఇచ్చేలా ఒప్పుకుంది.
ఇదిలా ఉండగా నానాటికి ధరలు పెరుగుతున్నా తన జీతం మాత్రం పెరగట్లేదని, ఇది డిజేబిలిటీ డిస్క్రిమినేషన్ కిందకు వస్తుందంటూ ఇయాన్ క్లిఫోర్డ్ 2022లో ఎంప్లాయ్ మెంట్ ట్రిబ్యునల్ లో దావా వేశాడు. ఇటీవల దీనిపై విచారణ జరిపిన ఎంప్లాయ్ మెంట్ ట్రిబ్యునల్ ఈ దావాను తిరస్కరించింది. ట్రిబ్యునల్ తన తీర్పులో ఈ విధంగా పేర్కొంది. ‘ఐబిఎం తో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇయాన్ వార్షిక జీతం 73వేల పౌండ్లు(రూ. 73లక్షలు). ఒప్పందం ప్రకారం ప్రతి ఏడు అందులో 75శాతం వేతనం 54వేల పౌండ్లు(రూ. 55లక్షలు) అందుకుంటున్నాడు. ఉద్యోగి పనిచేయకపోయినప్పటికి కంపెనీ ఇంత మొత్తాన్ని ముట్టజెప్తుందని ట్రిబ్యునల్ తెలిపింది. ఇది అతనికి సరిపోతుందని ఎంప్లాయ్ మెంట్ ట్రిబ్యునల్ జడ్జి పాల్ హూసెగో తీర్పు వెల్లడించారు.