Love: ప్రేమో, ఇష్టమో తెలీదు కానీ, ఓ అమ్మాయి తన కంటే 20 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని ప్రేమించింది. 10 ఏళ్లకు పైగా అతడితో ప్రేమలో మునిగితేలింది. పెద్దలను ఒప్పించి అతడ్నే పెళ్లి చేసుకుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు.. ఆమె మాజీ లవర్ తండ్రినే.. ఇంతకీ సంగతేంటంటే.. అమెరికాలోని ఓహియోకు చెందిన సిడ్నీ డీన్ ఆరవ తరగతి చదువుతున్నపుడు తన లవర్ ఇంటికి వెళ్లేది. అప్పుడు ఆమె వయసు 11 సంవత్సారాలు.. తరచుగా ప్రియుడి ఇంటికి వెళుతూ వస్తూ ఉండేది.
కొన్ని సంవత్సరాల తర్వాత ప్రియుడు వేరే అమ్మాయిని ప్రేమించటం మొదలుపెట్టాడు. దీంతో సిడ్నీ ప్రియుడితో దూరంగా ఉంటూ వచ్చింది. అయినా అతడి ఇంటికి వెళ్లటం మానలేదు. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రియుడి తండ్రి పాల్‌తో ఆమెకు పరిచయం పెరిగింది. తరచుగా పాల్‌తో మాట్లాడుతూ ఉండేది. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. ఆ సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు.
2016లో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని సిడ్నీ తన ఇంట్లో చెప్పింది. సిడ్నీ అమ్మకు పాల్ గురించి తెలుసు. పాల్ వయసు ఆమె కంటే పెద్దదన్న కారణంతో పెళ్లికి నో చెప్పింది. సిడ్నీ కొన్ని రోజుల పాటు తల్లిని బతిమాలింది. ఆ తర్వాత పాల్, సిడ్నీ తల్లి రెండు మూడు సార్లు ఈ విషయమై మాట్లాడుకున్నారు. పాల్‌కు సిడ్నీపై ఉన్న ప్రేమను గుర్తించి సిడ్నీ తల్లి పెళ్లికి ఒప్పుకుంది. అంగరంగ వైభవంగా ఇద్దరి పెళ్లీ జరిగింది. మొదట్లో బెట్టు చేసిన సిడ్నీ తండ్రి కూడా ఇప్పుడు వారితో కలిసిపోయాడు. వయసులో తనతో సమానమైన అల్లుడిని గౌరవించటం మొదలుపెట్టాడు.
ఇక, తమ ప్రేమ వివాహం గురించి సిడ్నీ మాట్లాడుతూ.. ‘‘ నా ఫ్రెండ్స్‌కు మా రిలేషన్ అంటే ఇష్టంలేదు. అందుకే నేను వారిని దూరం పెట్టాను. ఏజ్ గ్యాప్ ఉన్న జంటలో ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకుంటారు. దీన్ని జనం గుర్తించి తీరాలి. ఏజ్ గ్యాప్ ఉన్న రిలేషన్స్‌పై చాలా రకాల నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. కానీ, జంట విడిపోవటానికి అది కారణం కాదు. పాల్ ఓ మంచి భర్త. అతడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు’’ అని చెప్పుకొచ్చింది. మరి, సిడ్నీ, పాల్‌ల లవ్‌స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Woman Rents Her Husband: ఆ పనికోసం మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య!