తమ భర్తలు తమ మాట వినకుంటే అలిగి అమ్మగారింటికి ఇంటికి వెళ్లే భార్యలు ఉంటారు. లేదా భర్తల వీక్ పాయింట్ ఏదో తెలుసుకొని దానితో ఆడుకుంటారు. మరికొంత మంది అయితే బడితే పూజ చేస్తుంటారు. సాధారణంగా చెడు వ్యసనాలు అయిన మద్యం, సిగరెట్, గుట్కా లాంటివి మానేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం యోగ, మెడిటేషన్, కొన్ని మందులు కూడా వాడుతుంటారు. కొద్ది మంది మాత్రమే ఆ ప్రయత్నాల్లో తమను తాము నియంత్రిచుకోగలుగుతారు.
టర్కీకి చెందిన ఓ వ్యక్తి సిగరెట్లు మానేందుక వినూత్న ప్రయోగం చేశాడు.. తలకు రాగి తీగలతో హెల్మెట్‌ను తయారు చేశాడు. ప్రతిరోజూ బోనులాంటి హెల్మెట్ కి తాళం కూడా వేస్తాడు.. ఆ తాళం చేవి తన భార్యకు ఇస్తారు. ఇందుకు ఆయన భార్య కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వినడానికి, చూడటానికి ఇది కాస్త విడ్డూరంగా ఉన్నా… తన వ్యసనం మానుకునేందుకు ఆ వ్యక్తి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళితే..
టర్కీకి చెందిన ఇబ్రహీం కు ఎక్కువగా సిగరెట్లు తాగే అలవాటు ఉందట. ఎంతగా అంటే రోజుకీ రెండు మూడు సిగరెట్లు డబ్బాలు ఖాళీ చేస్తుంటాడు. తన తండ్రికి ఇలాంటి అలవాటు ఉండేదని.. ఆయన అలవాటు తనకు వచ్చిందని ఇబ్రహీం అంటారు. తన తండ్రి లంగ్ క్యాన్సర్ తో చనిపోయారట. చిన్న వయసులోనే ఇబ్రహీం సిగరెట్లు తాగే అలవాటు నేర్చుకున్నాడు. ఆనాటి నుంచి తాను ఎంత మానాలని ట్రై చేస్తున్నా మానలేకపోతున్నాడు.
ఈ క్రమంలో తాను ఒక వింతైన నిర్ణయం తీసుకున్నాడు. రాగితీగలతో తలకు హెల్మెట్ రూపంలో ఓ బోను తయారు చేయించుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బోను తన తలకు ధరించి దాని తాళం చేవి భార్యకు ఇస్తాడు. ఏదైనా అవసరం ఉన్నపుడు భార్య తాళం తీస్తుంది. ఇలా చేయడం వల్ల తాను చాలా వరకు సిగరెట్లు తాడం మానివేశానని అంటున్నాడు ఇబ్రహీం. ఇందుకు తన భార్య, పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారట. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.