మన శరీరంలో గుండె అనేది ముఖ్యమైన అవయవం. శరీరానికి రక్తం సరఫరా చేయటంలో గుండె ప్రధానమైనది. గుండె గనుక పని చేయటం ఆగిపోతే రక్త ప్రసరణ ఆగిపోతుంది. తర్వాత మనిషి చనిపోతాడు. అయితే, కొన్ని కొన్ని సందర్బాల్లో గుండె లేకపోయినా.. మనిషి బతికే అవకాశం ఉంది. కానీ, అది గుండె చేసే పనికి ఎలాంటి అంతరాయం కలగనపుడు మాత్రమే. ఇలా జరగకుండా ఉండాలంటే ఏదైనా యంత్రం సహాయం తప్పని సరి. ఒక వేళ యంత్రాన్ని ఉపయోగించి గుండె చేసే పనిని కొనసాగించినా ఎక్కువ కాలం బతకటం కష్టమే. రోజులు, నెలలు మాత్రమే బతికే అవకాశం ఉంది. 2011లో ఓ పెద్దాయన గుండె లేకుండా కేవలం నెల రోజులు మాత్రమే బతికాడు. గుండె మాత్రమే కాదు.. పల్స్ కూడా లేకుండా ఆయన ఇన్ని రోజులు బతకటం ఓ అద్భుత ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 55 ఏళ్ల క్రేగ్ లివిస్ అనే వ్యక్తికి అమిలాయిడ్‌డోసిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చింది. దీంతో అతడి గుండె, కిడ్నీ, లివర్ పాడయ్యాయి. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. డాక్టర్ బిల్లీ కాన్ అండ్ బడ్ ఫ్రేజర్‌లు గుండెను తీసేసి, రక్తం సరఫరాను కొనసాగించే మిషిన్‌ను ఉంచాలని నిర్ణయించారు. ఆ మిషిన్ పల్స్ లేకుండా లివిస్‌లో రక్త ప్రసరణను కొనసాగిస్తుందని తెలిపారు. ఈ ఇద్దరు డాక్టర్లు కలిసి ఓ మిషిన్‌ను తయారు చేశారు. దాన్ని 50 పశువులపై పరీక్షించారు. పశువుల గుండెను తీసి వీటిని అమర్చారు. గుండె తీసేసిన తర్వాత కూడా అవి వాటి పని చేసుకోగలిగాయి. ఈ నేపథ్యంలోనే లివిస్ భార్య గుండె భాగంలో మిషిన్‌ను ఏర్పాటు చేయటానికి ఒప్పుకుంది.
గుండె తీసే ముందు డాక్టర్లు లివిస్‌కు ఎన్నో పరీక్షలు చేశారు. తర్వాత గుండెను బయటకు తీసి పారేసి, ఆ మిషిన్ అమర్చారు. గుండెను తీసేసిన తర్వాత అతడిలో పల్స్ ఆగిపోయింది. అయితే, అంతా బాగా ఉందనుకుంటున్న సమయంలో అతడి కాలేయం, కిడ్నీలు బాగా పాడవుతూ వచ్చాయి. దాదాపు నెల రోజుల పాటు పల్స్ లేకుండా అతడు బతికాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2011 ఏప్రిల్‌లో అతడు చనిపోయాడు. కాగా, గుండె లేకుండా మిషిన్ సపోర్టుతో చాలా మంది బతికారు. ఓ వ్యక్తి ఏకంగా 550 రోజులకు పైగా జీవించాడు. మరి, గుండె, పల్స్ లేకుండా నెల రోజులు జీవించిన లివిస్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.