ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి ఎన్నో అద్భుత విషయాలు, వీడియోలు మన కంటిముందు ఆవిష్కరించబడున్నాయి. సాధారణంగా మన చుట్టూ అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొంత మంది చావు అంచుల వరకు వెళ్లి బతికిపోవడం నిజంగా మిరాకిల్స్ గా చెబుతుంటారు. అలాంటి సంఘటనే చైనాలోని జెంజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని టోంగ్జియాంగ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
షెన్ డాంగ్ అనే యువకుడు వీధి పక్కన తన కారును పార్క్ చేస్తున్నాడు. అంతలోనే అటుగా పెద్ద కేకలు వినిపించడంతో చుట్టుపక్కల చూశాడు. అక్కడ ఐదు అంతస్తుల భవనంలోని కిటికీ నుంచి ఓ చిన్న పాప కిందకు జారి పడిపోతోంది. వెంటనే అలర్ట్ అయిన.. డాంగ్ ముందుకు పరుగెత్తుకొచ్చి రెండు చేతులు చాచి పాపను పట్టుకున్నారు. కిటికీ నుంచి పడిపోతున్న సమయంలో ముందుగా ఆ చిన్నారి ఒక స్టీల్ రూఫ్ మీద పడింది. అక్కడ నుంచి జారి క్షణాల్లో కిందికి జారిపోయింది.
పాప కిటికిలో నుంచి పడిపోతున్న విషయం గమనించిన కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేయడం.. అదే సమయానికి
షెన్ డాంగ్ దంపతులు వేగంగా స్పందించడంతో పాప ప్రాణాలు దక్కాయి. ఎంతో సమయస్ఫూర్తి ప్రదర్శించిన పాప ప్రాణాలు కాపాడిన డాంగ్ దంపతులకు పాప కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియో ఓ ఉద్యోగి ‘మన మద్యనే ఉన్న హీరోలు’ అంటూ క్యాప్షన్ ఇస్తూ ట్విట్ చేశాడు. దీంతో షెన్ డాంగ్ నిజమైన హీరో అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన హీరోలు సినిమాల్లోకాదు, నిజ జీవితంలో ఉంటారంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022
ఇది చదవండి: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. గవర్నర్ తమిళిసై వైద్యం!