ఆపదలో ఉన్న సాటి మనుషులకు సాయం చేసేందుకే చాలా మంది మనసు రాదు. అలాంటిది రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతున్న బాతులకు సాయం చేద్దామని ముందుకొచ్చాడో వ్యక్తి.
ఇప్పుడు అందరి జీవితాలు ఉరుకుల పరుగులమయంగా మారాయి. భోజనం చేయడానికి, నిద్రపోవడానికి కూడా చాలా మందికి టైమ్ ఉండట్లేదు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రజల లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. పొద్దున నుంచి అర్ధరాత్రి వరకు చాలా మంది తమ కెరీర్, బిజినెస్ పనుల్లో బిజీబిజీగా ఉంటున్నారు. చాలా మంది తమ ఇంట్లో ఉన్నవారి గురించి సరిగ్గా పట్టించుకునే స్థితిలో లేరని నిపుణులు అంటున్నారు. దీని వల్ల మనుషుల మధ్య బంధాలు తగ్గిపోయాయి. స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతికి వచ్చేశాయి. అందరూ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. మనుషులను నేరుగా కలవడం కంటే ఫోన్లలో మాట్లాడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హైటెక్ యుగంలో మనుషుల మధ్య బంధాలు, మమతానురాగాలు క్రమంగా తగ్గుతూ పోతున్నాయి. సాటి మనిషి ఆపదలో ఉన్నాడంటే సాయం చేసేందుకూ జనాలు ముందుకు రావట్లేదు.
సాయం చేయమంటే ఎందుకు వచ్చిన తంటా.. మన పని మనం చూసుకుంటే సరిపోదా అనేలా ప్రవర్తిస్తున్నారు జనాలు. అయితే ఈ కాలంలోనూ మంచి మనసు ఉన్నవారు ఎందరో ఉన్నారు. సాటి మనుషులకే కాదు జంతువులకు ఏమైనా అయినా తట్టుకోలేని వారున్నారు. ఇదిలా ఉంటే.. రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతున్న బాతులకు సాయం చేయడానికి ముందుకొచ్చాడో వ్యక్తి. అయితే వాటికి వాటికి సాయం చేస్తూ అతడు దుర్మరణం పాలయ్యాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. బాతులు రోడ్డు దాటడంలో సాయం చేశాడు. అయితే ఇంతలో ఒక 17 ఏళ్ల యువతి ఆ వ్యక్తిని గమనించకుండా కారుతో ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అతడికి సోషల్ మీడియాలో నెటిజన్స్ నివాళులు అర్పిస్తున్నారు. సాయం చేసే గుణం గొప్పదని.. ఇలాంటి వారి అవసరం సమాజానికి ఎంతో ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
A man was fatally struck by a car in California as he was helping a family of ducks cross the road. https://t.co/96SR9ZpoR0
— KWTX News 10 (@kwtx) May 23, 2023