Lexical Gustatory Synaesthesia: ఈ ప్రపంచంలోని ప్రతీ మనిషి ఏదో ఒక వ్యాధి భారిన పడటం సహజం. కొంతమందికి నయం అయ్యే వ్యాధులు.. మరి కొందరికి ప్రాణాంతక వ్యాధులు వస్తుంటాయి. వీటన్నింటికి భిన్నంగా ఇంకా కొంతమందికి అరుదైన వ్యాధులు, మన మతి పోగొట్టే వ్యాధులు వస్తుంటాయి. అలాంటి వ్యాధుల గురించి తెలుసుకున్నపుడు మనం ఆశ్చర్యంలో మునిగిపోవాల్సిందే. తాజాగా, ఓ యువకుడిలో ఓ వింత వ్యాధి బయటపడింది. ఆ వ్యాధి ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదివేయండి.
ఇంగ్లాండ్‌లోని న్యూ కాసిల్‌కు చెందిన హెన్రీ గ్రేకు చాలా కాలం క్రితమే మెదడులోని నరాలకు సంబంధించిన ‘లెక్సికల్ గస్ట్రేటరీ సినస్థీషియా’ అనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వచ్చిన వారు పదాలను వాసన చూడగలరు, రుచి చూడగలరు అంతెందుకు వాటిని ఫీల్ కూడా అవ్వగలరు. ఈ వ్యాధి కారణంగా హెన్రీ పదాల గురించి విన్నపుడు, చదివినపుడు, మాట్లాడినపుడు వాటి రుచి తెలుసుకోగలుగుతున్నాడు. వాటి వాసన ఎలాంటిదన్నది కూడా చెప్పేస్తున్నాడు. క్రిస్టి అనే పేరు మూత్రం వాసన వస్తుందంటున్నాడు.
ఇక, జెన్నిఫర్ లారెన్స్ అన్న పేరు షూలోని వాసన.. కిమ్ కర్ధీషియాన్ కర్చీఫ్‌లా.. ఎమ్మా వాట్సన్ ఓ చిన్న గులక రాయి నీటి గుంటలో పడేసినట్లు అనిపిస్తుందట. హెన్నీ తనకు ఈ వ్యాధి ఉన్నదన్న సంగతి 2009లో తెలుసుకున్నాడు. మొదట్లో అందరూ తన లాగే పదాలను వాసన, రుచి చూడగలరని, ఫీల్ అవ్వగలరని అనుకోసాగాడు. తల్లిదండ్రులు, టీచర్స్ ద్వారా తనకున్న వ్యాధిని గుర్తించగలిగాడు. మరి, వింత వ్యాధితో బాధపడుతున్న హెన్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తన విడాకుల పార్టీలో పరిచయమైన వెయిటర్ ను పెళ్లాడిన మహిళ!