డేవిడ్ తన అన్నతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అన్నకు చెందిన తినుబండారాన్ని తిన్నాడు. అంతటితో ఆగకుండా అతడిపై రెండు గ్లాసుల నీళ్లు చల్లాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు రావటం సహజం. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. తిట్టుకునే వారు, కొట్టుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఎంత తిట్టుకున్నా.. ఎంత కొట్టుకున్నా తర్వాత కలిసిపోతుంటారు. అయితే, ఓ వ్యక్తి విషయంలో ఇలా జరగలేదు. అన్నతో చిన్న గొడవ అతడ్ని పెద్ద ప్రమాదంలో పడేసింది. 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవించే పరిస్థితి తెచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే. ఫ్లోరిడాలోని లీ కౌంటీకి చెందిన డేవిడ్ షెర్‌మన్ పోవెల్‌సన్ అనే 64 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం 65 ఏళ్ల తన అన్నతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. డేవిడ్ తన అన్నపై రెండు గ్లాసుల నీళ్లు విసిరి కొట్టాడు. తమ్ముడి ప్రవర్తనతో అన్నకు కోపం వచ్చింది.
వెంటనే పోలీసులకు ఫోన్ చేసి దీనిపై ఫిర్యాదు చేశాడు. బుధవారం పోలీసులు డేవిడ్‌ను అరెస్ట్ చేశారు. ఫస్ట్ డిగ్రీ కింద కేసు పెట్టారు. ఫ్లోరిడా చట్టాల ప్రకారం ఇలాంటి ప్రవర్తన నేరం. దీనికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వారి పట్ల ఇలా ప్రవర్తిస్తే.. కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. డేవిడ్ తన అన్నతో అమానుషంగా ప్రవర్తించటంతో పాటు అతడి తినుబండారాన్ని కూడా లాక్కుని తిన్నాడు. దీనికి గాను డేవిడ్‌కు దాదాపు 30 ఏళ్ల జైలు శిక్షతో పాటు వేల డాలర్ల ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. మరి, అన్నపై నీళ్లు చల్లి జైలు శిక్ష అనుభవించబోతున్న డేవిడ్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.