Brazil: ‘గురువు లేని విద్య గుడ్డి విద్య’ అని ఊరికే అనలేదు పెద్దలు. ఓ మంచి గురువు దగ్గర శిక్షణ తీసుకోకుండా చేసే ఏ పనైనా బెడిసి కొట్టడం సహజం. ఈ మధ్య కాలంలో కొన్ని లక్షల మంది యూట్యూబ్‌ను తమ గురువుగా భావిస్తున్నారు. అందులోంచి తమకిష్టమైనవి, అవసరమైనవి నేర్చుకుంటున్నారు. అయితే, కొన్ని చేయకూడని పనులను కూడా చేస్తున్నారు. డాక్టర్లు చేసే ఆపరేషన్లను కూడా చేసేస్తున్నారు.
ఆ ప్రయత్నం బెడిసికొట్టి చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారు. తాజాగా, ఓ బ్రెజిల్ వ్యక్తి యూట్యూబ్‌లో చూసి సొంతంగా కాస్మిటిక్ సర్జరీ చేసుకున్నాడు. ఆ ప్రయత్నం విఫలమై ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకీ సంగతేంటంటే.. బ్రెజిల్‌లోని సావోపోలోకు చెందిన ఓ వ్యక్తి తన ముక్కుకు కాస్మిటిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నాడు. అది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని తెలిసి, సొంతంగా తానే చేసుకుంటే బాగుంటుందనుకున్నాడు.
వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి ‘డూ ఇట్ యువర్‌సెల్ఫ్’ నోస్ ప్లాస్టిక్ సర్జరీల వీడియోలు చూశాడు. అనంతరం తన ముక్కుకు తానే సొంతంగా రైనో ప్లాస్టి సర్జరీ చేసుకున్నాడు. కానీ, ఆపరేషన్ చేసేటప్పుడు పాటించాల్సిన ఏ నియమాలు పాటించలేదు. ఆపరేషన్ చేయటానికి గ్లౌసులు కూడా వేసుకోలేదు. పైగా రక్తపు కాట్లను క్లీన్ చేయటానికి 70 శాతం ఆల్కహాల్‌ను వాడాడు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత రక్తాన్ని క్లీన్ కూడా చేసుకోలేదు.
దీంతో ఇన్‌ఫెక్షన్ సోకింది. వెంటనే క్యాంపో లింపో రీజన్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. అతడి ముక్కు పరిస్థితి గమనించిన వైద్యులు హుటాహుటిన ఇన్‌టెన్సివ్ కేర్‌లో చేర్చారు. వైద్యం అందించి అదే రోజు అక్కడినుంచి పంపేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆల్ ఖైదా చీఫ్ జవహరీ హతం.. అమెరికా అధ్యక్షుడు అధికారిక ప్రకటన!