రోడ్ల మీద, సిగ్నల్స్ దగ్గర, ఫుట్‌పాత్, గుడి బయట కూర్చుని అడక్కునే వారిని చూస్తే జాలి కలుగుతుంది. పాపం అనిపించి.. తోచినంత సాయం చేస్తాం. వృద్ధులు, వికలాంగులకు ఇలా సాయం చేయడంలో తప్పులేదు. కానీ కొందరు శరీరంలో ఏ లోపం లేకపోయినా సరే కష్టపడి పని చేయడానికి బద్దకించి.. అడుక్కోవడమే ఉత్తమ మార్గం అని ఫిక్సయి పోతారు. వారిని చూస్తే ఎవరు భిక్షం వేయరని భావించి.. పసిపిల్లలను అడ్డుపెట్టుకుని భిక్షాటన చేస్తుంటారు. పిల్లల ముఖం చూసైనా దానం చేస్తారని వారి ఆలోచన.
ఇక అప్పుడప్పుడు ఇలాంటి భిక్షగాళ్ల దగ్గర భారీ ఎత్తున డబ్బు లభ్యం కావడం.. అది చూసి మనం ఆశ్చర్యపోవడం తెలిసిన సంగతే. తాజాగా ఈ కోవకు చెందిన మరో సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ మహిళ అడుక్కోవడం ద్వారా ఏకంగా నెలకు 40,000 రూపాయలు సంపాదిస్తుంది. పైగా ఏ రోజు ఎంత కలెక్షన్ అనే దాని గురించి ఓ నోట్ పుస్తకంలో జాగ్రత్తగా రాసి పెట్టుకుంటుంది. ఈ యాచకురాలి గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చడవండి : బిచ్చగత్తె అనుకుంటే లచ్చాధికారిగా కనబడింది… ఇంతకీ ఎవరామె!??
సెపాంగ్ అనే ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసిన దాని ప్రకారం.. మలేషియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సదరు యాచకురాలి పేరు తెలియలేదు. ఇక ఆమె విదేశీ వనిత అని.. బుర్ఖా ధరించి.. ఒళ్లో ఓ చిన్నారిని పెట్టుకుని రోడ్డు పక్కన కూర్చుని.. భిక్షాటన చేస్తుంది. ఇక ఏ రోజు ఎంత వచ్చింది అనే దాని గురించి తన దగ్గర ఉన్న నోట్ బుక్ లో జాగ్రత్తగా రాసి పెట్టుకుంటుంది. 2021కి సంబంధించి ఆమె ప్రతి రోజు ఎంత సంపాదించింది అనే దాని గురించి నోట్ బుక్ లో రాసి పెట్టింది.
ఈ మొత్తాన్ని లెక్కిస్తే.. నెలకు సదరు యాచకురాలు ఏకంగా 40 వేల రూపాయలు సంపాదించినట్లు తెలిసింది. మలేషియాల పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేస్తున్న వారి ఆదాయం కూడా ఇంత ఉండదు. మహా అయితే 20, 25 వేల రూపాయల జీతం మాత్రమే ఉంటుంది. అలాంటిది సదరు మహిళ కేవలం భిక్షాటన ద్వారా నెలకు ఏకంగా 40 వేల రూపాయలు సంపాదించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇది కూడా చదవండి : వింత: భిక్షగాడి అంత్యక్రియలకు భారీగా హాజరైన ప్రజలు!
ఫేస్ బుక్ లో ఈ పోస్ట్ చూసిన వారు.. నెలంతా కష్టపడి పని చేసినా మాకు ఇంత ఆదాయం రావడం లేదు. నువ్వు కదలకుండా కూర్చుని నెలకు 40 వేలు సంపాదిస్తున్నావంటే గ్రేట్.. మేం కూడా ఇదే పని చూసుకుంటే మేలు అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. మరికొందరు మాత్రం ‘‘మలేసియా ప్రజలకు దానగుణం కాస్త ఎక్కువే. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమకు తోచిన సాయం చేస్తారు. పేదలకు అండగా ఉంటారు. ఈ దానగుణాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు బద్ధకస్తులు.. యాచకులుగా మారుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పని చేయడం చేతగాక.. ఇలాంటి వృత్తిని ఎంచుకుంటున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తద్వారా ఏమీ చేయకుండానే డబ్బును సంపాదిస్తున్నారని’’ విమర్శిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.