ప్రతి ఒక్కరు సమాజంలో తమకంటూ గుర్తింపు రావాలని కోరుకుంటారు. అందులో భాగంగా కొందరు గిన్నిస్ వర్డల్ రికార్డులో స్థానం దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. దానికోసం ఎవరు చేయని వాటిని చేసి గిన్నిస్ వరల్డ్ లో స్థానం సంపాదిస్తారు. అలా కొందరు చేసేవి ఉపయోగపడేవి అయితే పర్వాలేదు. నిరూపయోగంగా మారితేనే బాధ అనిపిస్తుంది. తాజా ఓ వ్యక్తి అలా గిన్నిస్ రికార్టు సాధించింది. వృదాగా మారిని తన వస్తువును చూసి బాధపడక వెరైటిగా మార్చి అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
అమెరికాకు చెందిన జే ఓర్ బెర్గ్ అనే వ్యక్తి దాదాపు 100 అడుగుల పొడవు ఉన్న కారును రూపొందించాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గతంలో ఉన్న ఆ కారు రికార్డును అదే బ్రేక్ చేసింది. అమెరికన్ డ్రీమ్‌గా పిలిచే ఈ కారు పేరు లియోసిన్. అతను 1986లో 60 అడగులు పొడవు గల కారుని రూపొందించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత మళ్లీ తన రికార్డుని తానే బ్రేక్ చేసేలా ఈ కారుని రూపొందించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ కారుని ప్రపచంలోనే అత్యంత పొడవైన కారుగా గుర్తించింది.
ఇతంటి కథ అయిపోలేదు.. ఆ కారు నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారింది. దీంతో ఆ కారుని న్యూజెర్సీ వేర్‌హౌస్‌లో ఉంచారు. ఎవరై అద్దెకు తీసుకోవడంలేదు. ఈ కారు ఆర్థికపరంగా పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ న్యూయార్క్‌లోని నాసావు కౌంటీలో ఆటోసియం టెక్నికల్ టీచింగ్ మ్యూజియం యజమాని మైఖేల్ మానింగ్ ఈ కారును లీజు తీసుకుని నిర్వహించేవాడు.
అయితే అగ్రిమెంట్ సమయం ముగిసేసరికి కారులోని పలు బాగాలు రిపేర్ కు పనికిరానంతగా పాడైనాయి. దీంతో మానింగ్ కారును ఈ-బే జాబిత చేసింది.ప్లోరిడాలోని రాష్ట్రం లోని ఓర్లాండోలో డెజర్‌ల్యాండ్ పార్క్ కార్ మ్యూజియం యజమాని మైఖేల్ డెజర్ 2019లో ఈ కారుని కొనగోలు చేశాడు. ఆ తర్వాత అతను కలసి ఈ అత్యాధునికంగా పునరుద్ధరించాడు. ఇప్పుడూ ఈ అతిపెద్ద కారులో 75 మందికి సీటింగ్ సామర్థ్యం ఉంది, డ్రైవింగ్ బోర్డ్‌తో సహా స్విమ్మింగ్ పూల్, వంటి అత్యాధునిక వసతులు అన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు ఆ పార్క్‌లో ప్రధాన ఆక్షర్షణ నిలిస్తోంది. మరి.. ఈ కారు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.