మానవ జాతిని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు మూగ జీవాల పాలిట మృత్యువై వెంటాడుతుంది. అమెరికాలోని సెయింట్ లూయిస్ జూలో ఎనిమిది జంతువులు కరోనా బారిన పడ్డాయి. విటిలో రెండు సింహాలు, రెండు చిరుత పులులు, ఒక అమూర్ టైగర్, ఒక ప్యూమా, రెండు జాగ్వార్‌లు ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. వీటిలో నాలుగింటిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించినట్లు.. మరికొన్ని జలుబు, దగ్గుతో బాధపడుతున్నాయని యూఎస్ సెయింట్ లూయిస్ జూ అధికారులు తెలిపారు.
ఈ ఎనిమిది జంతువులు మినహా.. జూలోని 12 వేల జంతువులు క్షేమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటికి కరోనా ఎలా సోకిందన్న విషయాన్ని ఇంకా గుర్తించలేదు. గత నెల రోజులుగా జూ అధికారులు జంతువులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైరస్ వ్యాపించడంతో ఆందోళన నెలకొంది. కాగా.. జంతువులకు కరోనా సోకుతున్న నేపథ్యంలో.. వాటినుంచి ప్రజలకు వైరస్ సోకుతున్నట్లు ఎలాంటి ఆధారాలు కనుగొనలేదని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. కానీ ప్రజల నుంచి జంతువులకు వైరస్ వ్యాప్తిచెందుతున్నట్లు ఆధారాలున్నట్లు పేర్కొంది.
కాగా ఇంతకు ముందు బ్రిటన్‌లోని ఓ పెంపుడు కుక్కకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. యజమాని నుంచే.. కుక్కకు కరోనా వ్యాపించినట్లు యూకే వైద్యులు నిర్ధారించారు. అంతకుముందు.. కుక్క యజమాని కరోనా బారిన పడ్డాడని.. అతని నుంచే వరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం కుక్క కోలుకుంటోందని వెల్లడించారు. అయితే.. ఈ విషయం మరవక ముందే మరో పులులు, సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
St. Louis Zoo reports 8 big cats tested positive for COVID-19 https://t.co/AQKupQ3KIU pic.twitter.com/5CCgIQJCIh
— The Hill (@thehill) November 12, 2021
Just keep piling on the crazy..
The St. Louis Zoo “has been vaccinating it’s animals .. for more than a month against the disease that has wreaked havoc on the global human population”
Fully vaxd tigers caught “covid”https://t.co/mgCXXCz3tn— TCupAussie☕️🐕 🇨🇦 (@DissidentPup) November 12, 2021
8 big cats at St. Louis Zoo test positive for COVID #MONews #KTLOnews https://t.co/maDZA5zgzD
— 997 The Boot (@997theboot) November 12, 2021