ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం రక రకాల ప్రయోగాలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. కొన్నిసార్లు వీరు చేసే సంట్స్ పై విమర్శలు కూడా వస్తున్నాయి.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ టాలెంట్ తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. ప్రపంచంలో జరిగే చిత్ర విచిత్రాలన్నీ సోషల్ మీడియాలో మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. కొన్ని వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ తెగ హల్ చల్ చేస్తున్నాయి. చాలా మంది యూట్యూబర్స్ వినూత్న రీతిలో నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ కోట్లు విలువ చేసే కారును క్షణాల్లో ధ్వంసం చేశాడు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
మిఖాయిల్ లిట్విన్ అనే రష్యన్ యూట్యూబర్ కొంతకాలంగా తన వీడియోలతో ఎన్నో రకాల వింత వింత స్టంట్స్ చేస్తూ ఆకర్షిస్తున్నాడు. వీక్షకులను ఎప్పుడూ ఏదో ఒక కొత్త అనుభూతిని కలిగించాలనే తపన ఉన్న ఈ రష్యన్ యూట్యూబర్ ఓ సాహసం చేశాడు. ఇందు కోసం తన కోట్ల విలువ చేసే కారును ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో లిట్విన్ ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్ లో భాగంగా తన లంబోర్ఘిని ఉరస్ కారును ధ్వంసం చేయడానికి పూనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ భారీ క్రేన్ సహాయంతో పెద్ద రాయిని తన లంబోర్ఘిని కారుపై పడేసి సెల్ఫీ తీసుకుంటూ హల్ చల్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యరు.
ఈ వీడియోని మిఖాయిల్ లిట్విన్ సోషల్ మిడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. సుమారు మూడు కోట్లు విలువ చేసే కారు.. తన ప్రమోషన్ కోసం ఇలా ధ్వంసం చేయడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది నెటిజన్లు ఇదంతా కేవలం స్టంట్ కోసమే.. రియాల్టీ ఉందా? ఒక యూజర్ కామెంట్స్ చేస్తే.. కేవలం లైక్స్, వ్యూస్ కోసం అంత ఖరీదైన వాహనాన్ని ఎవరూ ధ్వంసం చేసుకుంటారు? అని మరో యూజర్ కామెంట్ చేశాడు. మరికొంత మంది పాపులారిటీ కోసం యూబ్యూబర్లు దేనికైనా సిద్దపడుతున్నారని.. ఇదో రకం పిచ్చి బిజినెస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.