ప్రపంచ దేశాలన్నింటికి కొరకరాని కొయ్యగా తయారైన ఏకైక వ్యక్తి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తాను ఏం చేసినా అది సెన్సేషన్ అవ్వాల్సిందే. దేశంలో ప్రజలు ఆకలి అలమచిస్తున్నా కూడా అతను మాత్రం ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకోవడంపైనే నిధులు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా మరో క్షిపణి ప్రయోగం చేశారు. ఆ ఆయన ఎప్పుడూ చేసేది అదే కదా అనుకోకండి. ఈ సారి ప్రయోగంలో కాస్త వెరైటీ ఉంది.
ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు షాకిచ్చిన పంజాబ్ సీఎం..
ఈ ప్రయోగానికి కిమ్ హాలీవుడ్ స్టైల్ లో కనిపించారు. బ్లాక్ లెదర్ జాకెట్, బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని మొదట క్షిపణి ప్రయోగ ప్రాంతాన్ని కలియదిరిగారు. ఆ తర్వాత స్లోమోషన్లో షేడ్స్ తీసి ఎస్ ఇటీస్ టైమ్ అన్నట్లు సైగ చేయగానే.. క్షిపణిని బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత దానిని ప్రయోగించడం. అది సక్సెస్ కావడం.. ఆ విజయంపై వాళ్లు సంబరాలు చేసుకోవండి. ముఖ్యంగా కిమ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోవడాన్ని బాగా చూపించారు. వీడియో మొత్తం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ బీజీఎంతో మంచి ఎడిటింగ్ చేశారు.
ఎప్పుడూ పొరుగు దేశాల జీవనశైలిని తమ దేశంలో అనుమతించని కిమ్ ఇప్పుడు హాలీవుడ్ స్టైల్‌లో కనిపించడాన్ని దేనికి సంకేతమో కొందరికి అర్థం కావడంలేదు. ఇంక మిస్సైల్ హ్వాసాంగ్-17 విషయానికి వస్తే అది ఖండాంతర క్షిపణిగా అనుమానిస్తున్నారు. అంతేకాకుండా 2017 తర్వాత అతి పెద్ద ప్రయోగంగా భావిస్తున్నారు. ‘2017 నవంబరులో ప్రయోగించిన హ్వాసాంగ్-15 పరిధి కంటే ఇది చాలా ఎక్కువ అంటూ జపాన్ మంత్రి ఒనికి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కిమ్ ప్రయోగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
BREAKING: North Korea’s state-run television shows edited footage of Kim Jong Un guiding the test-launch of what the country referred to as the Hwasong-17 ICBM.
Latest story: https://t.co/belL7EdPUl
(Video: KCTV) pic.twitter.com/APifRhtJVr— NK NEWS (@nknewsorg) March 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.