చికెన్ ప్రియులకు KFC గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా KFCకి మిలియన్ కస్టమర్లు ఉన్నారు. నాన్ వెజ్ తినేవాళ్లే కాదు.. వెజిటేరియన్ల కోసం కూడా వాళ్లు వెజ్ బర్గర్లు, ఫ్రైస్ అందిస్తుంటారు. కానీ, అవి చికెన్ టేస్టును ఇవ్వలేవు కదా? ఇప్పుడు అలాంటి వెజిటేరియన్ వారికోసం KFC స్టైల్ లో వేగన్ చికెన్ రుచులను అందివ్వబోతోంది KFC.
కాకపోతే మొదట తన US అవుట్ లెట్స్ లో ప్రారంభించి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ వేగన్ చికెన్ ను జనవరి 10 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 4 వేలకు పైగా ఉన్న అమెరికాలోని KFC అవుట్ లెట్లలో ఈ వేగన్ చికెన్ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం KFC ప్రముఖ బియాండ్ మీట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇప్పటికే బీఫ్ ను పోలిన రుచితో వెజిటేరియన్ రుచులపై బియాండ్ మీట్ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు KFCతో కలిసి చికెన్ రుచులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ చికెన్ ను కాంబో, 6 పీస్, 8 పీస్ గా అందించనున్నారు. అమెరికాలో అయితే 6 పీస్ వేగన్ చికెన్ ధర దాదాపు 7 డాలర్లు(రూ.532) ఉంటుందని వెల్లడించారు. బియాండ్ మీట్ అభివృద్ధి చేసిన ప్లాంట్ బేస్డ్ చికెన్ అమెరికాలోని చాలా గ్రోసరీ స్టోర్లలో అందుబాటులో ఉంది. కానీ, KFCతో కలిసి చేస్తున్న చికెన్ రుచులు మాత్రం వాటికంటే భిన్నంగా ఉండబోతున్నట్లు తెలియజేశారు. ఇవి భారత్ కు ఎప్పుడు వస్తాయనే దానిపై స్పష్టత లేదు. KFC- బియాండ్ ఫ్రైడ్ చికెన్ చేస్తున్న ఈ ప్రయోగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Obsessed with Alison’s reaction to vegan chicken nuggets 😂 pic.twitter.com/1cgkousOrn
— This Morning (@thismorning) January 5, 2022