పానీ పూరి.. ఈ పేరు వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరికీ నోరూరిపోతూ ఉంటుంది. పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు.. అన్నీ రకాల రుచులను కలిగి ఉంటుంది. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా పానీ పూరి బండి కనిపిస్తే చాలు.. లగెత్తుకుంటూ వెళ్తారు. నార్త్ ఇండియా లో పానీ పూరికి మంచి డిమాండ్ ఉంది.. అక్కడ నుంచి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ పానీ పూరి అంటే ఎంతో ఇష్టపడేవాళ్లు పెరిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో గప్ చుప్ అని అంటారు. ఈ మద్య పెద్ద పెద్ద రెస్టారెంట్లు సైతం తమ హోటల్లో పానీపూరి ఒక మెనూ ఐటమ్ గా పెట్టుకుంటున్నారు. ఒకవేళ పానీ పూరీ వీషయంలో సుచీ, శుభ్రత పాటించనట్టయితే రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఈ మద్య పానీ పూరి గురించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది పానీ పూరిలో వాడే నీటి విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల కలుషితంగా మారి పలు వ్యాధులు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి అపరిశుభత్రతో ఉన్న నీటి వల్ల కలరా లాంటి వ్యాధులు వస్తున్నాయని అందుకే పానీ పూరి అమ్మకాలు నిషేదిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాకపోతే ఇది మన దేశంలో కాదు.. నేపాల్ రాజధాని అయిన ఖాట్మాండ్ లో ఈ నిషేదాన్ని విధించారు.
ఇటీవల నేపాల్ రాజధాని అయిన ఖాట్మండు వ్యాలీలోని కొన్ని ప్రాంతాల్లో కలరా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అక్కడ వైద్య సిబ్బంది వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఇక్కడ పానీ పూరి లో వాడిన నీరు కలుషితంగా ఉండటం వల్లనే కలరా ప్రబలిపోయిందని అధికారులు తెలిపారు. పానీ పూరి కోసం వినియోగించిన నీటిలో కలరా కి సంబంధించిన బ్యాక్టీరియా ఉండటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని నగర పాలక సంస్థ పేర్కొంది. దీంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో పానీ పూరి అమ్మకాలపై నిషేదం విధించారు.
నగరంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక బృందాలు వెళ్లి పానీ పూరి విక్రయాలను పూర్తిగా నిలిపివేయించేందుకు సన్నాహాలు చేశామని, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.