మిస్ వరల్డ్ కి ఉండే ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కిరీటం సొంతం చేసుకునేందుకు అనేక దేశాల నుంచి యువతులు పోటీ పడుతుంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ పోటీల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. 2021కి గాను 70వ మిస్ వరల్డ్ పోటీలు ప్యూర్టోరికో నిర్వహించారు. ఈ పోటీల్లో అందరిని వెనక్కి నెట్టి.. పోలాండ్ ముద్దుగుమ్మ కరోలినా మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది. 32 ఏళ్ల తర్వాత పోలండ్‌కు ఈ గౌరవాన్ని తెచ్చిన ఘనతను సాధించింది. ప్యూర్టోరికో రాజధాని సాన్ జ్వాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమెను విజేతగా ప్రకటించారు.
ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో జరిగిన వేడుకలో 2019 మిస్ వరల్డ్ టోనీ ఆన్ సింగ్.. కరోలినాకు కిరీటాన్ని అలకరించారు. భారత సంతతికి చెందిన అమెరికా యువతి శ్రీసైనీ తొలి రన్నరప్ నిలువగా.. ఒలియవా యాస్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఈ పోటీలు గతేడాది డిసెంబరు 16న జరగాల్సి ఉండగా.. మానస వారణాసి సహా 17 మంది పోటీదారులు కరోనా బారినపడడంతో వాయిదా వేశారు. ప్రపంచ సుందరి కిరీటం సొంతం చేసుకున్న 23 ఏళ్ల కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. పీహెచ్‌డీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆమెకు మోడల్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈత, స్కూబా డైవింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్‌ను ఇష్టపడే కెరోలైనా.. సామాజిక కార్యక్రమాల్లో చరుగ్గా పాల్గొంటారు. బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్టులో భాగంగా నిరాశ్రయుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. విన్నర్‌గా తన పేరు ప్రకటించగానే షాక్ అయ్యానని.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటూ తెలిపింది. ఈ ఘట్టం తన జీవితాంతం గుర్తుంచుకుంటాను అని తెలిపింది కరోలినా. మరి.. ఈ మిస్ వరల్డ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.