ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి.. వాటిలో మనకు కొన్నింటి గురించి బాగా తెలుసు. అలాంటి జంతువుల్లో ఒకటి కంగారూ. ఆస్ట్రేలియా పేరు చెప్పగానే వెంటనే జాతీయ జంతువు కంగారూ గుర్తుకు వస్తుంది.
ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి.. వాటిలో కొన్ని జంతువుల రూపాలు, ప్రత్యేకతలతో ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి జంతువుల్లో ఒకటి కంగారూ. ఈ జంతువు మార్సుపీలియాకు చెందిన క్షీరదం. ఆడ జీవులు శిశు కోశాన్ని కలిగి ఉంటాయి. కంగారూల తోక ఎంతో ధృడంగా ఉండి.. గెంతినపుడు ఎక్కువగా తోకపైనే నిలబడుతుంది.. అందుకే దీని తోకను ఐదవ కాలుగా పేర్కొంటారు. ఇవి శాకాహార జంతువులు. ఎక్కువగా ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూగినియా దేశాలలో జీవిస్తుంటాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కంగారూలు తలనొప్పిగా మారినట్లు అక్కడ వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియాలో కంగారూల సంతతిని అదుపులో పెట్టకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని అక్కడ పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో కంగారూలు అంటే కేరాఫ్ అడ్రస్ ఆస్ట్రేలియా అని అంటుంటారు.. కానీ ఇప్పుడు ఇవే దేశ పర్యావరణానికి పెద్ద తలనొప్పిగా మారిందని పర్యావరణవేత్తలు అంటున్నారు. సాధారణంగా కంగారూలను ‘బూమ్ అండ్ బస్ట్’ అని అంటుంటారు.. మంచి సీజన్ లో పశుగ్రాసం ఎక్కువగా లభిస్తే వీటి సంఖ్య ఒక్కసారే పది మిలియన్ల వరకు పెరుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ కంగారులు ఆకలి అయితే గడ్డవాములపై దాడులు చేసి తింటాయని.. దీని వల్ల గడ్డివాములు నాశనం అవుతుంటాయని అంటున్నారు.
కంగారూల గురించి వైద్య నిపుణురాలు కేథరీన్ మోసెబ్యా మాట్లాడుతూ.. అప్పట్లో దేశంలో కరువు సంభవించినపుడు 80 నుంచి 90 శాతం వరకు కంగారూలు చనిపోయాయి.. వాటికి ఆకలి వేస్తే తట్టుకోలేవు.. పబ్లిక్ టాయిలెట్ లోకి వెళ్లి టాయిలెట్ పేపర్ తినడం వంటివి చేస్తుంటాయి అని ఆమె అన్నారు. కంగారూల సంతతిని అదుపు చేయాంటే.. కాల్చి చంపడం, మాంసం ఉత్పత్తులను పెంచడం వంటివి చేస్తే మంచిదన్నారు. అయితే కంగారూలు ఆస్ట్రేలియాలో ఎప్పటికీ రక్షించబడుతూనే ఉంటాయి. అదేవిధంగా అవి అంతరించిపోయే జాతుల జాబితాలో లేనందున అధికార పరిధిలో కంగారూలను కాల్చి చంపవొచ్చు.. కాకపోతే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం స్వదేశీ పరిశ్రమల అవసరాల నిమిత్తం ఇక్కడ దాదాపు ఐదు మిలియన్ల కంగారూలను కాల్చి చంపుతున్నారు. మాంసం, పెంపుడు జంతువులకు ఆహారం, తోలు కోసం ఇలా చేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా కంగారూ ఇండస్ట్రీ అసోసియేషన్ కి చెందిన డెన్నీస్ కింగ్ మాట్లాడుతూ.. దేశంలో మరోసారి కంగారూల విజృంభణ కొనసాగుతుంది.. వీటి సంతానోత్పత్తి చక్రం వేగాంగా ఉందని అన్నారు. 2000 సంవత్సరంలో ఇక్కడ భారీగా కరువు ఏర్పడింది.. ఆ కారణంతో జాతీయ స్థాయిలో కంగారూలు 30 మిలియన్ల లోపు పడిపోయింది.. కానీ ఇది త్వరలో 60 మిలియన్లకు చేరుకోవచ్చు అని అన్నారు.