ఆఫ్ఘానిస్తాన్ కి తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్న తాలిబన్లు ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మొదట తాము శాంతియుతంగా ఉంటామని.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తీసుకు రాబోమని అన్నారు. కానీ ఆఫ్ఘన్ లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత వారి హింసాకాండ మళ్లీ మొదలు పెట్టారు.
అసలు తాలిబన్లు అంటేనే హింసావాలులు.. క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్ అంటారు. ప్రతి చిన్న విషయానికి వారు తుపాకులే వాడుతుంటారు.. వారికి ఎదురు తిరిగిన వాళ్లను దారుణంగా చంపేస్తారు. ఇక మహిళలపై వీరి అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఆఫ్ఘన్ లో తాలిబన్ల అధికారాన్ని వ్యతిరేకిస్తూ.. మహిళళు తమ హక్కుల కోసం రోడ్లేక్కుతున్నారు. తమ వ్యక్తిగత హక్కులు మరియు స్వేచ్ఛను కాపాడుకోవడానికి తాలిబన్లకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు.
అందులో భాగంగా తాలిబాన్లకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు పోరాటాలు చేస్తుంటే నిరసనకారులపై తాలిబన్లు దాడులు చేశారు. మహిళలపై తాలిబన్ ఫైటర్లు కాల్పులు జరిపారు. ఈ దారుణాలను కవర్ చేసేందుక వెళ్లిన జర్నలిస్టులను చితకబాదారు. అప్ఘాన్ లో నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను తాలిబన్లు అరెస్టు చేసి వారిని అతి దారుణంగా కొట్టారు. జర్నలిస్టులను ఎంతగా హింసించారో.. దానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అప్ఘానిస్థాన్ దేశంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటే ముందుగా తాలిబన్ న్యాయమంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాలని షరతులు పెట్టారు.