అమెరికా లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్రేషన్ ఓ కొత్త హెచ్చరిక జారీ చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకామందు కారణంగా కొన్ని కేసుల్లో పెరాలిసిస్ వంటి తలెత్తవచ్చునని ఈ సంస్థ పేర్కొంది. దీన్ని ‘ గులియెన్ బేర్’ సిండ్రోమ్ పేరిట వ్యవహరిస్తున్నామని తెలిపింది మోడెర్నా, ఫైజర్ టీకా మందుల విషయంలో ఈ సమస్య లేదని, ఒక్క జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ లోనే ఇది ఉన్నట్టు గుర్తించామని ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది. ఈ సిండ్రోమ్ లో నాడుల వ్యవస్థ బలహీనమవుతుందని, కండరాలు, నాడుల బలహీనత కారణంగా పక్షవాత లక్షణాలు అలాగే సరిగా నడవలేకపోవడం, కొన్ని కేసుల్లో సరిగా మాట్లాడలేకపోవడం, ఆహార పదార్థాలు మింగలేకపోవడం, దృష్టి లోపం వంటి వివిధ రుగ్మతలు తలెత్తవచ్చునని ఈ సంస్థ పేర్కొంది.
కాగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ విషయమై ఇండియాలో ఇప్పటివరకు ఏ ప్రమాదకరమైన హెచ్చరిక చేయలేదు. అమెరికా, లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రయోగాల్లో జేఅండ్‌జే వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది, సామర్థ్యమైనదని తేలింది. కరోనా వైరస్‌పై 85శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని వివిధ ప్రయోగాలు వెల్లడించాయి.
100 మంది నుంచి ఫిర్యాదులు అందుకున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న సమావేశాల్లో దీన్ని సమీక్షించమని సీడీసీ వ్యాక్సిన్ నిపుణుల ప్యానెల్‌ను కోరనుంది. అయితే దీనిపై జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకా స్పందించలేదు.
అమెరికాలో సుమారు 12.8 మిలియన్ల మంది పూర్తిగా టీకాలు తీసుకోగా , జనాభాలో 8 శాతం మంది – జాన్సన్ అండ్ జాన్సన్ షాట్ అందుకున్నారు. సుమారు 146 మిలియన్లకు ఫైజర్ లేదా మోడెర్నా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఇంకా ఈ వార్త మీద జాన్సన్ & జాన్సన్ ప్రతినిధులు ఏం మాట్లాడుతారో చూడాలి.
మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి: