అమోజాన్, బ్లూ ఆరిజిన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్, తన తమ్ముడు మార్క్ తో కలిసి బ్లూ ఆరిజిన్ చేపట్టిన మొదటి అంతరిక్ష యాత్ర లో జులై 20 న పాల్గొననున్నాడు. అమెజాన్ సంస్థ సీఈవో కల నెరవేరబోతోంది. అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవారు. తన సోదరుడితో అంతరిక్షంలో విహరించనున్నట్లు జెఫ్ బేజోస్ స్వయంగా వెల్లడించారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. బేజెస్ కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఒరిజన్ తయారు చేసిన న్యూ షెపర్ట్ రాకెట్ లో సోదరులిద్దరూ 2021, జులై 20వ తేదీన గగనంలో విహరించనున్నారు. అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే ఆ ఫీలింగ్ అద్బుతంగా ఉంటుందని పోస్టు చేసిన వీడియోలో వెల్లడించారు. న్యూ షెపర్డ్ అనే అంతరిక్ష నౌక లో ఆన్ లైన్ బిడ్డింగ్ లో సీటు కొనుక్కున్న ధనికులను అలా కాసేపు అంతరిక్షంలో తిప్పుకుని వస్తాడు. ఇది భవిష్యత్ లో రానున్న స్పేస్ టూరిజంకు అంకురార్పణ అవుతుందని జెఫ్ బెజోస్ అంటున్నాడు.
బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ నౌకలో సీటుకోసం నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్ లో 20 కోట్ల రూపాయలకి ఆ నౌకలో సీటు కొనుక్కున్నాడు. ఈ రాకెట్ లో ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది. సముద్రమట్టం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కర్మన్ లైన్ వరకు రాకెట్ వెళుతుంది. అక్కడ క్యాప్యూల్ నుంచి బూస్టర్ వేరు అవుతుంది. ఈ సమయంలో రాకెట్ లో ఉన్న వారు భూమి ఎలా ఉందో సంపూర్ణంగా చూసే ఛాన్స్ ఉంది. గురుత్వాకరణ శక్తి లేకుండా ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలుగుతుంది. అనంతరం బూస్టర్, క్యాప్సూల్ లు వేర్వేరుగా ల్యాండ్ అవుతాయి.
ఈ యాత్రపై అమెరికన్స్ మండిపడుతున్నారు. కరోనా టైమ్ లో ఎంతోమంది అమెరికన్ లు ఉద్యోగాలు కోల్పోయి నిరాశ్రయులు అయితే కోట్లాది రూపాయలు స్పేస్ టూరిజం పేరుతో వృథా చేస్తావా అంటూ ఆన్ లైన్ ఓటింగ్ పెట్టారు. అంతరిక్షంలోనే ఉండిపో, మళ్లీ భూమికి రాకు అంటూ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 33 వేలకు పైగా ఈ ఓటింగ్ లో పాల్గొని, బెజోస్ భూమికి రావొద్దని చెబుతున్నారు.
అంతరిక్ష యాత్ర కాదు నువ్వు సూర్యుడి దగ్గరకు యాత్ర చేయి అని, ఆ స్పేస్ షిప్ ప్రయాణిస్తూ ఉండగా అందులోంచి దూకెయ్ అని ఇలా తమ కోపాన్ని కామెంట్ల రూపంలో పెడుతున్నారు.