శాస్త్రసాంకేతికతలు ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి అంతరిక్షంలోకి దూసుకెళ్లినా.. మూఢ నమ్మకాలు మాత్రం సమాజం నుండి పూర్తిగా తొలగిపోవడం లేదు. ఇప్పటికే చేతబడి, భానామతి, దెయ్యాలు, భూతవైద్యం వంటివి సమాజంలో అలానే ఉన్నాయి. మన దేశంలోనే ఇలా అనుకుంటే పొరపాటే. అభివృద్ధ చెందిన దేశాలుగా, అగ్రరాజ్యాలుగా పిలవబడుతున్న దేశాల్లో సైతం ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా బలంగా ఉన్నాయి. సాంకేతికతలో దూసుకుపోతున్న జపాన్ లో మూఢనమ్మకాల పాళ్లు మరి కాస్త ఎక్కువే అంటున్నారు ఆ దేశం, అక్కడి ప్రజల జీవన విధానం గురించి పూర్తిగా తెలిసినవారు. తాజాగా వెలుగు చూసిన ఓ సంఘటన కూడా ఇదే నిరూపిస్తోంది. ఓ రాయి బద్దలవ్వడంతో జపాన్ వాసులు విపరీతంగా భయపడిపోతున్నారు.. ఏదో ఉపద్రవం ముంచుకురాబోతుందని బెంబేలెత్తుతున్నారు. మరి జపాన్ వాసులను అంతలా భయపెడుతున్న ఆ రాయి కథేంటో మీరు కూడా తెలుసుకొండి.
ఇది కూడా చదవండి: బెలూన్లు అమ్ముకునే యువతి జీవితాన్ని మార్చేసిన ఫొటో
టెక్నాలజీ పరంగా జపాన్.. ప్రంపచంలోనే నంబర్ వన్ దేశంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 100 శాతం అక్షరాస్యత సాధించిన దేశంలో.. జనాలు మూఢనమ్మకాలను బలంగా విశ్వసిస్తారు అంటే నమ్మలేం. ఇందుకు నిదర్శంగా నిలిచే సంఘటన గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. జపాన్‌లోని సారు ప్రాంతంలో ఉన్న ఓ రాయిలో ఆత్మ కాపురం ఉంటుందని అక్కడ ఇప్రజలు నమ్ముతారు. ఈ మృత్యు శిలను వారు సెషో-సెకి అని పిలుస్తారు. అయితే, ఏం జరిగిందో తెలియదు కానీ… మార్చి 6న ఆ కిల్లింగ్ స్టోన్ కాస్తా ముక్కలైపోయింది. దాంతో స్థానికులు హడలిపోతున్నారు. ఆ పురాతన శిల ఇలా బద్దలవడం అరిష్టమంటున్నారు. ఏదో పెను ప్రమాదం రాబోతుంది అని విపరీతంగా భయపడుతున్నారు జపాన్ వాసులు.
శిల కథేంటంటే..
జపాన్ పురణాల్లో సెషో-సెకి శిలకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. పురణాల ప్రకారం.. ఆ శిలలో 9 తోకల నక్క రూపంలో ఉండే ఓ పిశాచి నివాసం ఉంటుందని ప్రతితీ. ఆ మాయలమారి నక్క అందమైన సుందరాంగి తమామోలా మారి టోబా చక్రవర్తిని అంతమొందించడానికి కుట్ర పన్నిందని, అయితే యుద్ధంలో సుందరాంగి తమామో ఓడిపోవడంతో ఆమె ఆత్మ మృత్యుశిలలో చిక్కుకుపోయిందని చెబుతారు. కాగా ఈ శిల నాసు ప్రాంతంలోని అగ్నిపర్వతాల మధ్యలో ఉంటుంది. ఇక సెషో-సెకి శిలను తాకినవాళ్లు చనిపోతారని.. దాన్ని చూడ్డం కూడా అరిష్టమే అని జపాన్ వాసులు బలంగా నమ్ముతారు.
ఇది కూడా చదవండి: భర్తను సమానంగా షేర్ చేసుకుంటాం అంటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు..
1957 నుంచి ఇది చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది. మృత్యువుకు ప్రతీకగా భావించే.. ఈ శిలను ఇలా ముక్కలైన స్థితిలో చూడటం కూడా అశుభమేనని ఓ జపాన్ నెటిజన్ తెలిపాడు. కాగా, జపాన్ కు చెందిన ఓ వెబ్‌సైట్ కథనం మాత్రం వర్షం, ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడం వలనే ఆ రాయి పగుళ్లు వచ్చి ముక్కలై ఉంటుందని తెలిపింది. ఏది ఏమైనా ఈ చిన్న బండరాయి.. ఇప్పుడు జపాన్ వాసులను భయపెడుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.