Couple : పెళ్లైన తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారటం అన్నది సర్వసాధారణం. ఇప్పుడంటే ప్రముఖుల కూతుళ్లు ఇంటి పేర్లు మార్చుకోవటం లేదు కానీ, మిగిలిన వారంతా పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోవాల్సిందే. ఇంటి పేరు మార్చుకోవటం కోసం ఓ భార్యభర్తల జంట ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని వెస్ట్రన్ టోక్యోలోని హచియోజికి చెందిన ఓ యువతీ, యువకుడు కాలేజ్ టైంలో ప్రేమించుకున్నారు. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
అయితే, పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోవటానికి ఆ యువతి ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి కూడా తన ఇంటి పేరు మార్చుకోనన్నాడు. జపాన్ చట్టాల ప్రకారం భార్యాభర్తలు ఒకే ఇంటి పేరును కలిగి ఉండాలి. ఇంటి పేరు మార్పుపై ఇద్దరి మధ్యా కొన్ని రోజులు చర్చలు జరిగాయి. మూడేళ్లు ఒకరి ఇంటి పేరు, మరో మూడేళ్లు మరోకరి ఇంటి పేరు.. ఇలా మూడేళ్ల కొకసారి ఇంటి పేరు మార్చుకుంటూ కాపురం చేద్దాం అనుకున్నారు. 2016లో పెళ్లి చేసుకున్నారు. హనీమూన్‌లో ఉన్నపుడు చీటీలు వేశారు. అపుడు భర్త ఇంటి పేరు చీటీలో వచ్చింది. మొదటి మూడేళ్లు అతడి పేరు వాడాలని నిశ్చయించుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమెకు ఆ పేరు పెట్టుకోవటం ఇబ్బందిగా అనిపించింది.
మూడేళ్లు గడిచాయి. తర్వాత విడాకులకు అప్లై చేసి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ సారి భార్య ఇంటి పేరును వాడుకున్నారు. 2018లో విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తాజాగా, 2021లో విడాకులు తీసుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇలా ఇంటి పేరు కోసం విడాకులు తీసుకుని, మళ్లీ పెళ్లి చేసుకుంటున్న ఈ భార్యభర్తల జంట జపాన్ మొత్తం ఫేమస్ అయిపోయింది. ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పోలీస్ కావాలన్నది ఆమె కల.. పోర్న్ స్టార్ అయ్యింది!