సులభంగా డబ్బులు సంపాందించాలనే ఉద్దేశ్యంతో చాలా మంది అడ్డదారులు తొక్కుతుంటారు. కొందరు దొంగతనాలకు పాల్పడుతుంటారు. అలాంటి వారిని ఎప్పటికప్పుడు పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేస్తుంటారు.దీంతో ఆ దొంగలు కూడా పోలీసులకు దొరక్కుండా చిత్ర విచిత్రమైన ప్లాన్ లో రచిస్తుంటారు. అలా తాజాగా ఓ దొంగల ముఠా బ్యాంకు దొంగతనానికి విచిత్రమైన పథకం రచించింది. బ్యాంకుకు కన్నం వేయడానికి ఆ దొంగల ముఠా ఏకంగా సొరంగం తవ్వేశారు. అయితే అంతా బాగుంది.. అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుందనే సమయంలో ఉన్నట్లుండి హఠాత్తుగా సొరంగం కూలిపోయింది. ఈ ఘటనలో ముఠా సభ్యులు బయటపడగా.. వారి నాయకుడు మాత్రం అందులో చిక్కుకుపోయాడు. ఈ ఘటన రోమ్ దేశంలో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం…
రోమ్ లోని వాటికన్ సిటీలో మూసి ఉన్న బ్యాంకును దోచేయాలని ఓ దొంగల ముఠా భావించింది. అయితే షటర్ తాళాలు బద్దలు కొట్టి చోరీకి యత్నిస్తే.. దొరికిపోతామని భావించిన ఐదుగురు సభ్యులు గల ఆ ముఠా.. ఏకంగా సొరంగం తవ్వి, అందులో నుంచి బ్యాంకు లోపలికి వెళ్లి లూటీ చేయాలని భావించింది. అనుకున్నదే తడువుగా తమ పనిని ప్రారంభించింది. ఆ దొంగలు ఓ మూసి ఉన్న దుకాణాన్ని వారి ప్లాన్ కి సరైన ప్రాంతంగా భావించారు. అక్కడి నుంచి సొరంగాన్ని తవ్వడం మొదలు పెట్టారు. పాపం ప్రతి రోజూ కొద్ది కొద్దిగా తవ్వుతూ.. ఇప్పటికే ఆరు మీటర్ల మేర సొరంగాన్ని తవ్వేశారు. ఇక కొన్ని మీటర్లు తవ్వేస్తే బ్యాంకు దగ్గరికి చేరి.. అక్కడ ఉన్న ఊడ్చేయెచ్చు అని ఉవ్విళ్లూరారు. అయితే ఆ దొంగలకు ఊహించని ఘటన ఎదురైంది. ఉన్నట్లుండి ఆ సొరంగం కూలిపోయింది. ఎలాగోలా నలుగురు సభ్యులు అందులో నుంచి బయటపడ్డారు. కానీ అసలు ఆ దొంగల ముఠా నాయకుడు మాత్రం అందులో చిక్కుకుపోయాడు. దీంతో ఏం చేయాలో బోధపడని ఆ దొంగలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరు మీటర్ల లోతులో అతడు ఉన్నాడని గుర్తించారు. అతడిని కాపాడేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. సమాంతరంగా మరొక గోతిని తవ్వారు. కొంతదూరం గోతి తవ్వాక.. “రక్షించండి, ఊపిరి ఆడటంలేదు, బయటకు తీసుకెళ్లండి” అంటూ అరుపులు వినిపంచాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆక్సిజన్ తో పాటు ద్రవరూపంలో ఆహారాన్ని సోరంగాలోని వ్యక్తికి అందించారు. ఎట్టకేలకు 8గంటల నిర్విరామ ప్రయత్నం అనంతరం అతడిని బయటకు తీశారు. అతడికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘పాపం.. దొంగలు ఏదో అనుకున్నంటే.. ఇంకేదో జరిగింది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.