ఈ భూమిపై తల్లి ప్రేమను మించి ఏదీ లేదు.. నవమాసాలు కనీపెంచి బిడ్డకోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. తన ప్రాణాలు పోయేంత వరకు బిడ్డ యోగక్షేమాల కోసం అహర్శిశలూ పాటుపడుతుంది.
అమ్మను మించిన దైవం ఉన్నాదా.. తల్లి ప్రేమా అనురాగం ముందు ఆ దేవుడైనా తలదించాల్సిందే అంటారు. భగవంతుడు అందరి వద్ద ఉండలేడు.. అందుకే భూమిపై అమ్మను సృష్టించాడని అంటారు. నవమాసాలు మోసి తను పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది.. పొత్తిళ్లలో తన బిడ్డను చూసుకొని ప్రసవవేదన మరచిపోతుంది. తన బిడ్డకు చిన్న నొప్పి కలిగినా తల్లడిల్లిపోయి కన్నీరు పెట్టుకుంటుంది.. బిడ్డ క్షేమం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడుతుంది. సృష్టిలో మనిషి మాత్రమే కాదు.. పశుపక్షాదులు కూడా తల్లిప్రేమను గొప్పగా చాటుకుంటాయి. తాజాగా ఇటలీ పార్లమెంట్ లో ఓ అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఇటలీ పార్లమెంట్ లో బుధవారం ఓ అపురూప ఘటన చోటు చేసుకుంది.. చట్టసభలోనే తన బిడ్డకు పాలు ఇస్తున్న మహిళా ఎంపీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటలీకి చెందిన ఎంపీ గిల్దా స్పోర్టిల్లో తన కుమారుడికి పార్లమెంట్ హాల్ లో పాలు ఇస్తూ బుజ్జగించి నిద్రపుచ్చింది. తల్లి ఏ స్థాయిలో ఉన్నా.. ఏ పదవిలో ఉన్న మృతృహదయాన్ని చాటుకుంటుందని.. బడ్డ ఆలనా పాలనా చూసుకుంటుందని ఎంపీలంగా హర్షధ్వానలతో ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. అంతేకాదు ఆ మహిళా ఎంపీ పై ప్రశంసలు కురిపించారు. బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం చాలా దేశాలలో సర్వసాధారణం. కాకపోతే.. ఇటలీ వంటి పురుషాధిక్యత ఉన్న దేశంలో దిగువ సభలోని ఓ మహిళ ఎంపీ సభలో బిడ్డకు పాలు ఇవ్వడం ఇదే తొలిసారి అంటున్నారు.
ఇటలీ పార్లమెంటరీ సమావేశాలకు అధ్యక్షత వహించిన జార్జియో ములే మాట్లాడుతూ.. సభలో అన్ని పార్టీల మద్దతు ఆ మహిళా ఎంపీకి లభించింది.. అంతేకాదు సభలో బిడ్డకు పాలు ఇవ్వడం ఇదే మొదటిసారి అని అన్నారు. కాగా, ఇటలీలోని పార్లమెంటరీ రూల్స్ ప్యానెల్ మహిళా ఎంపీలకు ఏడాది వయసు ఉన్న బిడ్డలతో పార్లమెంట్ గదికి రావడానికి, పాలు ఇవ్వడానికి అనుమతించింది. ప్రస్తుతం పార్లమెంట్ లో బిడ్డకు పాలు ఇస్తున్న మహిళా ఎంపీ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తల్లి ఏ పదవిలో ఉన్నా తల్లే.. బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడంలో ఆమె తర్వాతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Italien, heute.
Gilda Sportiello ist die erste Abgeordnete, die mit einem Neugeborenen in die Abgeordnetenkammer erscheint und ihr Baby Federico stillt. Der Applaus der gesamten Versammlung war lang und intensiv. pic.twitter.com/ZFytixegus— TheMissRossi 🍋 (@TheMissRossi) June 7, 2023