ఎవరైనా ఓ ఇంటికి లేదా ఓ స్థలాన్నికి ఓనర్ కావలనుకుంటారు. కానీ ఓ దివికి ఓనర్ కావాలని ఎవరు కలగనరు. అలా దీవికి ఓనర్ గా ఉండాలని అనుకుంటే, అది ఎవరి వద్ద అయినా ప్రస్తావిస్తే.. నవ్వికొట్టిపారేస్తారు. కానీ కొందరు మాత్రమం ద్వీపాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నారు. దానిలో మరికొందరిని భాగస్వాములుగా చేయాలనకున్నారు. అసలు ఏమిటి ఈ ఐలాండ్ కొనుగోలు కథ. ఆ విషయాలేమిటో తెలుసుకుందాం..
సుమారు 15 ఏళ్ల క్రితం లెట్స్ బై యాన్ ఐలాండ్ అనే వెబ్‌సైట్ సీఈవో గ్యారెట్ జాన్సన్‌కు ఒక ఐలాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన వచ్చింది. తొలుత ఆ ఆలోచనని చాలామంది హేళన చేశారు. అయిన.. మరికొందరు ఆయనతోపాటు కలిసి ఐలాండ్‌ను కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు కొనసాగించారు. మధ్య అమెరికాలో కరీబియన్ సముద్రంలో బెలీజ్ దేశం ఉంది. ఈ దేశానికి చెందిన కాఫీ కేయ్ అనే చిన్న ద్వీపం ఒకటుంది. మొత్తం 96 మంది ఇన్వెస్టర్లుగా మారి.. ఈ ద్వీపం కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. 2018లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 2019 కల్లా ఆ ఇన్వెస్టర్ల గ్రూపు సుమారు 2 లక్షల 50 వేల అమెరికన్ డాలర్లను పోగు చేసింది. చివరికి ఆ దీవి ఇన్వెస్టర్ల గ్రూపు కొనుగోలు చేసింది.
ఇక 2022 ఫిబ్రవరిలో తొలిసారిగా ఈ టూర్ గ్రూప్ కాఫీ కేయ్ దీవిలో ల్యాండ్ అయింది. ఇందులో 13 మంది టూరిస్టులు, ఓనర్లు ఉన్నారు. వారు ఈ చిన్ని దేశాన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం 249 మంది ఈ దీవికి చెందిన పౌరులుగా ఉన్నారు. సమీప భవిష్యత్‌లో ఈ దీవిలో పౌరుల సంఖ్యను 5 వేలకు పెంచాలని ఆలోచిస్తున్నారు. ఆ ఇన్వెస్టర్లు కేవలం రియల్ ఎస్టేట్‌లో భాగంగా కాఫీ కేయ్ దీవిని కొనుగోలు చేయలేదని.. ఆ దీవిని నిజంగా ఒక దేశంగా నిర్మిస్తున్నారని ఓ మీడియా సంస్థ పేర్కొంది.అయితే.. ఈ దేశ స్వాతంత్య్రాన్ని ఇప్పటికైతే అంతర్జాతీయ సమాజం గుర్తించలేదు. భవిష్యత్‌లో గుర్తిస్తే.. ప్రపంచ పటంపై మరో దేశం పురుడు పోసుకుంటుంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.