కష్టమర్లని ఆకట్టుకోవడానికీ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తాయి ., ఖరీదైన వస్తువులతో అలంకరిస్తుంటాయి వ్యాపార సంస్థలు. ఓ పబ్‌ను మాత్రం దాని ఓనర్లు డబ్బుతోనే డెకరేషన్ చేసారు. ఆ డబ్బు విలువ రూ.కోట్లు ఉంటుంది. ఫ్లోరిడాలోని పెన్సాకోలా ప్రాంతంలో మెక్ గైర్ దంపతులు 1977లో మెక్ గైర్స్ ఐరీష్ పబ్‌ను ఏర్పాటు చేశారు. గైర్ సతీమణి మొల్లీ బేరర్‌గా ఉంటూ కస్టమర్ల ఆర్డర్లను తెచ్చి ఇచ్చేది. సర్వీసు మెచ్చి ఒక వ్యక్తి ఒక డాలర్ నోట్ టిప్ ఇవ్వగా దానిపై తేదీ రాసి బార్‌లో టేబుల్‌కు అతికించింది. ఆ డాలర్ పబ్‌కు అదృష్టాన్ని తెస్తుందని ఆమె నమ్మింది. ఆ తర్వాత ఆమెకు టిప్ రూపంలో వచ్చే ప్రతి నోటును బార్‌లోనే అతికించడం మొదలుపెట్టింది. దీన్ని గమనించిన కస్టమర్లు నోటుపై వారి పేరు రాసి ఇవ్వడం ప్రారంభించారు.
అలా కాలక్రమంలో పబ్ మొత్తం నోట్లమయమైపోయింది. దీంతో యాజమాన్యం టేబుల్స్‌కు, గోడలకు అతికించిన నోట్లను తీసి సీలింగ్‌కు వేలదీశారు. ప్రస్తుతం ఈ పబ్‌లో అలంకరించిన నోట్ల విలువ అక్షరాల 2మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.14.61కోట్లు). ఎవరికీ అందకుండా నోట్లను సీలింగ్‌కు వేలాడదీశారు.
కొన్నిసార్లు దొంగతనం జరిగి కొంత డబ్బు పోయిందని యజమానులు చెబుతున్నారు. అయితే, ఇక్కడి వేలాడదీసిన నోట్లపై కస్టమర్లు నలుపు రంగు పెన్నుతో చేసిన సంతకాలు ఉంటాయి. ఈ పబ్, నోట్లపై సంతకాలు చేసే సంప్రదాయం ఆ ప్రాంతంలో అందరికి తెలిసి ఉండటంతో కొట్టేసిన నోటు ఏ దుకాణంలో ఇచ్చినా వెంటనే పబ్ యాజమాన్యానికి విషయం తెలిసిపోతుంది. దొంగ దొరికిపోతాడు.
అందుకే ఏ చింతా లేకుండా నోట్లను వేలాడదీసే సంప్రదాయాన్ని పబ్ కొనసాగిస్తోంది. ఇదొక్కటే కాదు – ఫ్లోరిడాలోనే డెస్టిన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరో పబ్‌లో కూడా నోట్లను అతికించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే – పబ్‌లో అలంకరించిన ఆ డబ్బుకు యజమానులు ఆదాయపన్ను చెల్లిస్తుండటం విశేషం.