మన సమాజంలో వైద్య వృత్తికి అపారమైన గౌరవం ఉంది. వైద్యో నారాయణో హరి అంటూ డాక్టర్‌ను ఏకంగా దేవుడితో పోలుస్తారు. అంతటి గౌరవప్రదమైన వృత్తికి.. నేడు కొందరు డాక్టర్లు.. తమ ప్రవర్తనతో చెడ్డ పేరు తెస్తున్నారు. వైద్యం కోసం తమ దగ్గరకు వచ్చే వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చిన వారిలో ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా 48 మందిపై తన కోరిక తీర్చుకున్నాడు ఓ డాక్టర్. ఆ దారుణ సంఘటన వివరాలు..
ఇది కూడా చదవండి: నటుడు ఆలీ కలను నిజంచేసిన కూతురు.. ఖుషీలో ఫ్యామిలీ!
ఈ దారుణం లండన్‌లో వెలుగు చూడగా.. ఇక ఈ కీచక వైద్యుడు భారత సంతతి వ్యక్తి కావడం దురదృష్టకరం. డాక్టర్ కృష్ణ సింగ్(72) చాలా ఏళ్ల నుంచి బ్రిటన్‌లో వైద్యుడిగా పని చేస్తున్నారు. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే మహిళలపై అకృత్యాలకు పాల్పడుతుండేవాడు. ఈ క్రమంలో మొదటి సారి 2018లో ఓ మహిళ.. డాక్టర్ కృష్ణ సింగ్ తనను వేధించారంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి వరకు తమకు జరిగిన దారుణాన్ని మౌనంగా భరించిన బాధితులు ఒక్కొక్కరే బయటకు వచ్చి.. సదరు వైద్యుడు తమపై చేసిన దారుణాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌లోని వైద్యుడి కోసం మెగాస్టార్ చిరంజీవి ట్వీట్!
ఈ క్రమంలో కృష్ణ సింగ్ 1983 ఫిబ్రవరి నుంచి 2018 మే వరకు మొత్తం 48 మంది మహిళపై ఇలాంటి ఘోరానికి పాల్పడ్డట్టుగా గ్లాస్గోలోని హైకోర్టు గురువారం వెల్లడించింది. మే నెలలో కృష్ణ సింగ్‌కు శిక్ష ఖరారు చేయనుంది. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి.. ఇలాంటి పాడు పనికి పాల్పడ్డ కృష్ణ సింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.