భారత ఆర్మీ జవాన్ హనీట్రాప్ లో చిక్కుకున్నాడు. ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ లో డ్యూటీ చేస్తున్న కృనాల్ కుమార్ బరియా అనే సైనికుడు పాకిస్తాన్ ఐఎస్ఐ కు చెందిన ఆఫీసర్ సిద్రాఖాన్ తో 2020 లో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరు చాటింగ్ చేసుకోవటం మొదలు పెట్టారు.
ఆమె వలపు వలలో చిక్కుకుని హనీట్రాప్ లో పడ్డాడు భారత ఆర్మీ జవాన్. దీంతో మెల్ల మెల్లగా ఆమే కోరినట్లు భారత ఆర్మీ రహస్య పత్రాలను చేరవేతకు సిద్దమయ్యాడట. ఇక తాజాగా ఇది గమనించిన పంజాబ్ పోలీసులు భారత ఆర్మీ రహస్యాలను పంపుతున్న సైనికుడు కృనాల్ కుమార్ బరియాను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక హనీట్రాప్ లో చిక్కుకునే ఈ విధంగా రహస్యాలను పంపినట్లు తెలుస్తోంది.