రష్యా- ఉక్రెయిన్ మధ్య గత కొన్నిరోజులుగా భీకర యుద్ధం జరుగుతోన్న విషయం అందరికి తెలిసిందే. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా దాడులు చేస్తోంది. వాటిని ఉక్రెయిన్ కూడా అదే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా అనేక మంది సామాన్య పౌరు లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ లో వేలాంది మంది భారతీయులు కూడా చిక్కుకుని ఉన్నారు. వారిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించేదుకు అక్కడ ఉన్న భారతీయ విదేశాంగ శాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈక్రమంలో భారత్ జెండ పాక్, టర్కీ విద్యార్థులను కాపాడింది.
భారత్ జెండాను పెట్టుకుని ఉక్రెయన్ సరిహద్దుల వరకు చేరాలని విద్యార్థులుకు భారతీయ విదేశంగా అధికారులు సూచనలు చేశారు. అలా వెళ్లే వారికి ఇటూ ఉక్రెయిన్ అటూ రష్యా ఎటువంటి అసౌకర్యం కలిగించలేదు. ఈ క్రమంలో భారతీయులు ప్రయాణిస్తున్న బస్సులకు భారత్ జెండాను పెట్టుకొని బయలుదేరాలని సూచించింది. దీంతో భారత విద్యార్థులు జెండా పెట్టుకొని గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇదే అవకాశాన్ని పాక్, టర్కీ విద్యార్ధులు కూడా వాడుకుంటున్నారని ఇండియన్ స్టూడెంట్స్ చెబుతున్నారు.
” భారత జెండా కారణంగా మాకు సులభంగా అనుమతులు లభించింది. కర్టెన్స్ మరియూ కలర్ స్పేర్ ను ఉపయోగించి జెండాను తయారు చేశాం. ఈ భారత్ జెండా భారతీయులతో పాటు ఇద్దరూ పాకిస్తానీ, టర్కీష్ విద్యార్థులకు ఎంతగానో సహయపడింది” అని బుకారెస్ట్ చేరుకున్న తరువాత భారతీయ విద్యార్థి తెలిపాడు. ప్రపంచం దేశాల్లో భారత్ గల ప్రాముఖ్యతకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | “We were easily given clearance due to the Indian flag; made the flag using a curtain & colour spray…Both Indian flag & Indians were of great help to the Pakistani, Turkish students,” said Indians students after their arrival in Bucharest, Romania#UkraineCrisis pic.twitter.com/vag59CcPVf
— ANI (@ANI) March 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.