మద్యం మహమ్మారి వల్ల ఎక్కువగా బాధపడేది ఆడవాళ్లే. మగాళ్లు తప్పతాగి.. వారి జీవితాలనే కాక కుటుంబ భవిష్యత్తును కూడా నాశనం చేస్తారు. ఆడవాళ్లు సంపాదించిన సొమ్ము కూడా లాక్కెళ్లి తాగి తందనాలడే వాళ్లు మన సమాజంలో కోకొల్లలు. మద్యపానానికి వ్యతిరేకంగా ఒక్క మనదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. చాలా దేశాలు మద్యం అమ్మకాలు, వినియోగానికి సంబంధించి పలు నియమాలు పెట్టుకున్నాయి. ఇక మన దేశంలో మైనర్లుకు మద్యం విక్రయించకూడదు. కానీ చాలా చోట్ల ఈ నియమాన్ని పాటించడం లేదు. ఇక సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని మన దగ్గర ఏ ప్రభుత్వం కూడా ప్రకటించదు. ఎందుకంటే.. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంలో అధిక భాగం మద్యం విక్రయాల నుంచే వస్తోంది. కనుక ఏ ప్రభుత్వం ఆ దిశగా సరైన చర్యలు తీసుకోదు.
కానీ ఓ చోట మాత్రం మందు తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలట. ఆమె పర్మిషన్ ఇవ్వకపోతే.. సదరు వ్యక్తికి మద్యం విక్రయించవట షాపులు. మందుబాబులను కంట్రోల్ చేసే ఈ రూల్ మనదగ్గర అయితే కాదు. కానీ అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న న్యూటౌన్‌లో ఈ రూల్ అమల్లో ఉన్నట్లు అక్కడి మీడియాతో పాటు సోషల్ మీడియాలో పలు కథనాలు ప్రచురితం అయ్యాయి. కానీ పెన్సిల్వేనియా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం ఇలాంటి రూలేం లేదు.
ఇది కూడా చదవండి: IAS Officer Success Story: కష్టాల కడలి నుంచి ఉన్నత శిఖరాలకు.. నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రయాణం!
అయినా సరే.. ఎందుకు ఇలా ప్రచారం అవుతుంది అంటే.. న్యూటౌన్ ఆల్కహాల్ రూల్‌లో ఈ నియమం అమల్లో ఉందని.. కాకపోతే అమల్లో లేదని చెబుతున్నారు. అక్కడ కూడా మైనర్లకు మద్యం విక్రయించారు. ఈ వార్త చదివిన వారు.. ‘‘ఈ రూల్ ఇండియాలో ఉంటే ఎంత బాగుండు’’ అని కామెంట్స్ చేస్తుండగా.. మందుబాబులు మాత్రం.. ‘‘బతికించావ్.. ఇండియాలో ఈ రూల్ ఉంటే.. ఇక మా పని అంతే’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వింత రూల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Kovai Sarala: షాకింగ్ లుక్‌లో సీనియర్ నటి.. కోవై సరళ