Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. ప్రొటెక్టివ్ బెయిల్ పూర్తవగానే ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నట్లు పాక్ మంత్రి రానా సనావుల్లా తెలిపారు. ఈ నెల 25 తర్వాత అరెస్ట్ చేస్తామన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శనివారం ఇస్లామాబాద్ ర్యాలీ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఐజీ, మహిళా జడ్జిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సన్నిహితుడు షహ్‌బాజ్ గిల్‌ను అరెస్ట్ చేసిన తర్వాత చిత్రహింసలకు గురి చేశారని ఆయన ఆరోపించారు. అందుకు కారణం ఐజీ, మహిళా జడ్జినేంటూ.. వారిని వదిలి పెట్టేది లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ తన పార్టీపై తేడాగా వ్యవహరిస్తోందని అన్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఐజీ, మహిళా జడ్జిపై కేసులు పెట్టాలన్నారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ ఐజీ, మహిళా జడ్జిపై బెదిరింపులకు పాల్పడుతూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయనపై సెక్షన్ 7 యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇమ్రాన్ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ బెయిల్ కేవలం మూడు రోజులకు మాత్రమే పరిమితమైంది. ఆగస్టు 25న బెయిల్ గడువు ముగియనుంది. బెయిల్ గడువు ముగిసిన వెంటనే ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి, ఇమ్రాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లుల కోసం.. ప్రతి నెలా రూ. 18 వేలు బోనస్!