ఆమె నెలలో మూడు సార్లు చనిపోయానని అంటోంది. అంతేకాదు! చనిపోయిన ప్రతీసారి ఆమె ఆత్మ ప్రముఖులను కలిసిందట. ఆ ప్రముఖుల్లో జీసస్ క్రీస్ట్, వాల్ట్ డిస్నీ అధినేత వాల్ట్ డిస్నీ కూడా ఉన్నారు.
పుట్టుక, చావు అన్నవి ప్రతీ మనిషి జీవితంలో ఒకేసారి జరుగుతాయి. పుట్టిన ప్రతీ మనిషికి చావు తప్పదు.. అయితే, చచ్చిన మనిషి బతకటం అన్నది అసాధ‍్యం. మనుషులు చావు దగ్గరి వరకు వెళ్లి వెనక్కు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. కానీ, చచ్చిన మనిషి మళ్లీ బతికిన దాఖలాలు లేవు. అలాంటిది.. ఓ మహిళ తాను నెలలో మూడు సార్లు చనిపోయానని అంటోంది. అంతేకాదు! తాను ఆత్మగా మారిన తర్వాత దేవుడ్ని, ప్రముఖుల్ని కలిశానని కూడా అంటోంది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌లోని బిర్కెన్‌హెడ్‌కు చెందిన 57 ఏళ్ల బీవెర్లీ గిల్‌మర్ చెప్పిన దాని ప్రకారం.. ఆమెకు 20 ఏళ్లు ఉన్నపుడు బ్రెయిన్ ట్రోమా వచ్చింది.
దీంతో ఆమె చనిపోయిన అనుభవాన్ని పొందింది. ఆ సమయంలో ఆమె గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది. శరీరం మెల్లగా పని చేయకుండా పోతుంది. కొద్ది సేపటి తర్వాత ఆమె ఆత్మ శరీరంనుంచి బయటకు వస్తుంది. ఆ ఆత్మ శూన్యంలోని మరికొన్ని ఆత్మలతో కలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె వాల్ట్ డిస్నీ కంపెనీ అధినేత వాల్ట్ డిస్నీని కలిసింది. ఆయన ఆమెతో చాలా కథలు చెప్పాడు. వాల్ట్ డిస్నీ ఉండే ప్రదేశంలో ఓ అద్భుతమైన కట్టడం ఉంది. చెక్కతో చేసిన అది ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఆమె కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత వాల్ట్ డిస్నీ చెప్పిన వాటన్నింటినీ రాసేది. బొమ్మల్ని కూడా గీసేది. అంతేకాదు! ఆయన కథల్లో ఆమె ఓ పాత్రగా కూడా మారింది. ఆయన కథలు చెబుతున్నపుడు ఆమె శ్రద్ధగా వినేది.
బీవెర్లీ ఆత్మగా మారినపుడు తన తండ్రిని కూడా చూసింది. మొదటి సారి ఆమె అతడ్ని కలిసినపుడు ఆయన వయసు 52 ఏళ్లలాగా అనిపించింది. ఎందుకంటే అతడు ఆ వయసులోనే చనిపోయాడు. రెండో సారి చూసినపుడు మాత్రం 30 ఏళ్లలాగా కనిపించాడు. తన కూతుర్ని చూసిన ఆనందంలో ఆయన ఎంతో సంతోషంగా కనిపించాడు. ఇలా ఆమె చనిపోయిన ప్రతీసారి ఎవరో ఒక ప్రముఖుడ్ని చూస్తూ ఉంది. జీసస్‌ను కూడా ఆమె కలిసింది. ఆయనతో స్నేహం కూడా చేసింది. మరి, నెలలో మూడుసార్లు చనిపోయానంటున్న బీవెర్లీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.