ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ బాబ్ సాగేట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ గదిలో సాగేట్ శవమై కనిపించాడు. మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఆయన ఓ షో గురించి సరదాగా ట్వీట్ చేశారు.
గత రాత్రి ఓర్లాండోలోని రిట్జ్-కార్ల్‌టన్‌లోని హోటల్‌లో బసచేసిన ఆయన రూమ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆయన మృతిచెందినట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం సాగేట్ మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Loved tonight’s show @PV_ConcertHall in Jacksonville. Appreciative audience. Thanks again to @RealTimWilkins for opening. I had no idea I did a 2 hr set tonight. I’m happily addicted again to this shit. Check https://t.co/nqJyTiiezU for my dates in 2022. pic.twitter.com/pEgFuXxLd3
— bob saget (@bobsaget) January 9, 2022
హాలీవుడ్ కమెడియన్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాబ్ సాగేట్ 1956 మే 17న అమెరికాలో జన్మించాడు. 1887 నుండి 1995 వరకు ప్రసారమైన ABC టెలివిజన్ షో ‘ఫుల్ హౌస్’లో డానీ టాన్నర్ పాత్రతో బాబ్ సాగేట్ బాగా పాపులర్ అయ్యాడు. దీని సీక్వెల్‌గానే ‘ఫుల్ హౌస్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓ వెబ్‌సిరీస్ కూడా తెరకెక్కించారు.